• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vesavi Coolie ( Vesavi Cooly)

Vesavi Coolie ( Vesavi Cooly) By Kumara Yasaswi

₹ 175

శ్రీరాం కళ్ళు తెరిచాడు. తనకు రోజూ నిద్రలేచే సమయానికే మెలకువ వచ్చింది. రాగానే తనకు ఈ రోజు నుండి వేసవి సెలవులని జ్ఞాపకం వచ్చింది. వెంటనే నిద్రమత్తు మొత్తం ఒక్కసారిగా మాయమైంది. ప్రతిరోజు బద్దకంతో నిండుండే కళ్ళు, ఈరోజు ఉత్తేజంతో మెరుస్తున్నాయి. పెదవులపై నవ్వు చిగురించింది. ముఖంలో స్వేచ్ఛ తాలూకు ఊరట కనిపిస్తోంది. ఉన్నపాటుగా పైకిలేచి ఎగిరి గంతేయాలనేంత ఉత్సాహంగా ఉంది తనకి. ఈ క్షణం కోసం రెండు నెలల నుండి ఎదురుచూశాడు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు సెలవులొస్తాయా అని రోజులు లెక్కపెట్టుకున్నాడు. చివరికి ఆ క్షణం వచ్చేటప్పటికి ఆనందం పట్టలేకపోతున్నాడు. ఆ ఉత్సుకతను నిదానించుకునేందుకు తనకు ఒక క్షణం పట్టింది. ఆకాశంలో ఓమూల వెలుగు మొదలైంది కానీ సూర్యుడి జాడలేదని గమనించాడు. వేసవి సమీపిస్తున్న కాలం నుండి మేడమీద పడుకోవడం కుటుంబానికి అలవాటు. ఇంట్లో ఉక్కబోతగా ఉంటుందని కాబోలు!

తలతిప్పి ప్రక్కగాచూశాడు. అమ్మ, నాన్న, తమ్ముడు ఇంకా నిద్రపోతున్నారు. తల నిటారుగా పెట్టి ఆకాశంకేసి చూస్తూ 'సూర్యుడికే ఇంగా మెలకువ రాలేదు. నేను లేచి చేసే పనేముండాది. అయినా ఇన్నిరోజులుగా బాకీపడ్డ నిద్రను తీర్చుకుందాం,' అని అనుకొని పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. శరీరమైతే కుదుటపడింది కానీ బుర్రలో మాత్రం సెలవుల్లో తను ఏమేమి చేయాలనే ఆలోచనలు అలుపులేకుండా పరుగెడుతున్నాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడం, సరదాగా తిరగడం, అల్లరి చెయ్యడం, బయట ఊర్లకి వెళ్ళడం, ఇలాంటి ఆలోచనలన్నీ వేసవి మొత్తం సంతోషంగా దిగుల్లేకుండా గడపాలనే ఆశను కలిగిస్తున్నాయి. కొద్దిసేపటికి ఉత్సాహం మత్తుగా మారి మళ్ళీ నిద్రపట్టేసింది.

తిరిగి తనకు మెలకువ వచ్చేటప్పటికి వేసవి సూర్యుడు తనను తాపంగా.............

  • Title :Vesavi Coolie ( Vesavi Cooly)
  • Author :Kumara Yasaswi
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN5720
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :123
  • Language :Telugu
  • Availability :instock