• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vidvesha Rajakeeyaalu

Vidvesha Rajakeeyaalu By V Ram Bhupal

₹ 200

నిర్భయ గొంతుక

విజ్ఞాన దీపిక 

------------ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

“మార్పు రావడమంటే పార్టీలు, ప్రభుత్వాలు మారడం కాదు అవి అనుసరించే విధానాలకు ప్రత్యామ్నాయం కావాలి. ఆర్ధిక సామాజిక, రాజకీయ అంశాల్లో స్పష్టమైన

విధానాలు వామపక్షాలకు మాత్రమే ఉన్నాయి" (పుస్తకం :22వ పేజీ) ప్రశ్నించడమే నేరమైపోతున్న రాజకీయవ్యవస్థలో మనమున్నాం. రూపంలో ప్రజాస్వామ్యం, సారంలో నిరంకుశత్వంగా సాగుతున్న రాజకీయ విధానం రాజ్యమేలుతున్నది. ఎన్నికల సమయంలో అసాధారణ హమీలిచ్చి, అధికారంలోకి రాగానే హామీలను గాలికొదలి, హామీలతో సంబంధంలేని రహస్య ఎజెండాను అమలు చేసే వంచనాత్మక పాలనలో మనం జీవిస్తున్నాం. ప్రచారం ఎక్కువ, పని తక్కువ, ఇవ్వని మాటల వెనుక విషగుళికలు. ప్రజలంటే చులకన, సంపన్నులంటే ఆలింగనం ఇలాంటి సందర్భంలో బతుకువెళ్ళదీస్తున్నాం. అధికారం కోసం ఎన్ని అరాచకాలకైనా తెగబడే దుర్మార్గ కాలం నడుస్తున్నది. మతం, వ్యాపారం అన్నదమ్ములుగా చెట్టాపట్టాల్ వేసుకుని నడుస్తున్నాయి. బతుకే అంగడి సరుకై పోయిన విచిత్ర సందర్భం రాజ్యమేలుతున్నది.

ఈ సంక్లిష్టసమయంలో సిపిఐ(ఎం) అనంతపురం జిల్లా కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. రాంభూపాల్ నిర్భయంగా, నిస్సంకోచంగా బూర్జువా పార్టీల పాలనావిధానాలను విమర్శిస్తూ నిరంతరం 'ప్రజాశక్తి'లో వ్యాసాలు రాస్తున్నారు. బూర్జువా పార్టీలు పరస్పరదూషణలలో మునిగిపోయి ఉంటే, వామపక్షవాది నిర్మాణాత్మక విమర్శ చేస్తున్నారు. ఆయన రాసిన అసంఖ్యాక వ్యాసాల నుండి ఎన్నిక చేసిన 34 వ్యాసాలతో "విద్వేష రాజకీయాలు" పేరున ఈ పుస్తకం ప్రజాశక్తి ద్వారా....................

  • Title :Vidvesha Rajakeeyaalu
  • Author :V Ram Bhupal
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN5977
  • Binding :Paerback
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :152
  • Language :Telugu
  • Availability :instock