• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vuppala Lakshmanrao Rachanalu

Vuppala Lakshmanrao Rachanalu By Vikasam Barampuram

₹ 250

జమీరు చక్రవర్తి- ప్రపంచ రహస్యము
 

(పుప్పల లక్ష్మణరావు, డి.యస్.సి.ఎం.ఏ)
 

పూర్వము పరిష్యాదేశంలో జమీరు పాదుషా అని ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం చేస్తూ వుండేవాడు. అతడు తన పట్టాభిషేకం అయినప్పుడు తన రాజ్యంలోవున్న మహాపండితులందరిని తన దగ్గరకు రమ్మని ఉత్తరవు చేశాడు. వాళ్లందరు వచ్చి అతనికి జోహారు చేసి నిలబడియుండగా వాళ్లతో "ఇహం పరం సాధించి మోక్షం పొందడానికి జ్ఞానమే మార్గమని మన పూర్వులు చెప్పేరు. జ్ఞానముంటే మనుష్యజాతియొక్క తప్పొప్పులు. మనకు తెలిసి మనం ముందుకు జాగ్రత్తపడగలం. అందుచేత నాకు మనుష్యచరిత్ర తెలుసుకోవలెనని కుతూహలంగా వుంది. నాకోసం మీరందరూ కలిసి దేశంలో యెక్కడెక్కడ భాండాగారాలున్నాయో యెక్కడెక్కడ తాటాకులపుస్తకాలున్నాయో అవన్ని వెతికి ప్రపంచక చరిత్రపరిపూర్ణంగా రాసి తీసుకురావలసింది" అని ఆజ్ఞాపించాడు. చిత్తమని పండితులంతా వెళ్ళిపోయారు.

వెళ్ళిపోయి, వెంటనే ప్రపంచ చరిత్ర రాయడానికి మొదలుపెట్టేరు. అలాగు రాత్రి పగలు తిళ్లు యెరక్క తిప్పలెరక్క ఇరవై సంవత్సరాలు కష్టపడి పూర్తిచేసి ఆ మహాగ్రంథాన్ని పట్టుకొని చక్రవర్తి దగ్గరకు వచ్చారు. ఏలాగు వచ్చారంటే - పన్నెండు ఒంటెలు, ఒక్కొక్క ఒంటెమీద ఐదు వందల గ్రంథాలు - ఆ మహా గ్రంథాన్ని పెట్టించుకొని మహారాజు దగ్గరకు వచ్చారు.

అప్పుడు మంత్రి చక్రవర్తితో 'మహా ప్రభూ! పండితులందరూ నీ యాజ్ఞ పాలించి ప్రపంచ చరిత్ర నీకోసం రాసిపట్టుకువచ్చారు. ఆ గ్రంథం ఆరువేల సంపుటములు పట్టింది. ప్రపంచంలో ఎన్ని దేశములున్నాయో ఆయా దేశముల చరిత్రలు భూగోళరాజనీతి శాస్త్రములు ఆచార వ్యవహారాంశములతో నిండియున్నది. ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతమే ఒక ఒంటె మొయ్యగలిగినంతటి బరువున్నది. సమాప్తి పర్వమును మరొక ఒంటెమొయ్యలేక మోయుచున్నది అన్నాడు.

అందుకు చక్రవర్తి పండితులతో "మీరు పడినటువంటి శ్రమకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాని నాకు రాజ్యపరిపాలన తొందర్ల వల్ల ఒక ఘడియేనా తీరుబాటు లేకుండా వున్నది. అదిగాక నాకిప్పుడు ముసలికాలం కూడా దగ్గిరకు వస్తున్నది....................

  • Title :Vuppala Lakshmanrao Rachanalu
  • Author :Vikasam Barampuram
  • Publisher :Vikasam Barampuram
  • ISBN :MANIMN6188
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :264
  • Language :Telugu
  • Availability :instock