Logili Books

Sociology

Adhunika Basha Sastra Sidhanthalu

By Dr P S Subramanyam

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adhunika Basha Sastra Sidhanthalu
Publisher
Suravaram Prathapareddy Telugu Viswa Vidyalayam
ISBN
MANIMN6825
Binding
Paerback
Published Date
2025, 8TH PRINT
Number Of Pages
374
Language
Telugu
Availability
In Stock
About this book
  1. భాష - స్వరూప స్వభావాలు

1.1. మానవ భాష - ఉత్పత్తి చర్చలు

"దేవీం వాచ మజనయంత దేవా

స్తాం విశ్వరూపాః పశవో వదంతి

సానో మంద్రేష మూర్ఖం దుహానా

ధేను ర్వా గస్మా నుప సుష్టుతైతు"

(ఋగ్వేదం, మండలం 8, సూక్తం 89, ఋక్కు 11).

(దేవతలు వాగ్దేవిని సృష్టించారు; ఆ వాక్కును వ్యక్తవాక్కులూ అవ్యక్త వాక్కులూ అయిన సర్వజంతువులూ మాట్లాడతాయి. బాగా స్తుతించబడిన ఆ వాగ్దేవి స్తుతిచే సంతోషించి (లేక వరాలిచ్చి సంతోషించేటట్టు చేస్తూ) అన్నాన్నీ, పాలూ నెయ్యీవంటి రసాల్నీ ఇచ్చే ధేనువై మమ్మల్ని పొందుగాక!)

మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాష మాట్లాడగలగడం, భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే భాష మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి ఏదీ లేదు. మెదడులో గాని ముఖయంత్రంలో గాని లోపాలున్న కొద్దిమందికి తప్ప మిగిలిన మానవులందరికీ మాట్లాడే శక్తి ఉంది. మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలని బహిర్గతం చెయ్యడానికి ద్వారా చేసే ధ్వనులే భాష. మనకు తెలియని భాష ఒకరు వ్యవహరిస్తున్నప్పుడు మనం వినేవి ఆ వ్యక్తి నోటి ద్వారా చేసే రకరకాల ధ్వనులే. ఆ భాష తెలిసినవారికి ఆ ధ్వనుల అర్థం బోధపడుతుంది; తెలియనివారికి వాటి అర్థం బోధపడదు. కాబట్టి భాష అంటే కొన్ని ధ్వనుల సముదాయమేనని దీనివల్ల తెలుస్తుంది. కోతులు, పశుపక్ష్యాదులు కూడా భయం, ప్రేమ, కోపం, ఆకలి మొదలైన భావాలని సూచించడానికి అరుపులు ఆరుస్తాయి. అయితే మానవభాషకి, పశుపక్ష్యాదుల అరుపులకి మధ్య ఎంతో భేదం ఉంది. జంతువుల అరుపులలో ఏడెనిమిది లేక పది కన్న ఎక్కువ రకాలు ఉండవు. కాని మానవభాషలో రకరకాల ధ్వనులు కలిసి మాటలుగా..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?