పురుషుని మోసానికి, మరో పురుషుని అన్యాయపు శాపానికి బలైన స్త్రీగా ప్రజల మనస్సులో నాటుకుపోయిన పురాణ పాత్ర అహల్య. ఈ వృత్తాంతం మొత్తంలో అహల్య చేసిన తప్పు ఉందా లేక ఆమె తప్పు చేయకుండానే అన్యాయంగా శాపానికి గురైందా అనే విచికిత్స క్వచిత్తుగానైనా నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇలా ఉన్నా, పురాణ పతివ్రతల కోవలో ప్రముఖులలో ఒకరిగానే గుర్తింపు ఉంది. ఈ కథ నోటి సాహిత్యం ద్వారా జానపద సమాచార వ్యవస్థలో భాగంగా ప్రజల నోళ్ళలో నానినది కావడాన ముఖ్యంగా రామాయణంలో రాముని పాదస్పర్శతో తిరిగి స్త్రీగా రూపొందిన కారణంగా మరింత ప్రాచుర్యం పొందిన పాత్ర అహల్య..........................