Logili Books

Short Stories

Asamanyulaina Samanyulu

By Sudha Murthi

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Asamanyulaina Samanyulu
Author
Publisher
Alakananda Prachuranalu
ISBN
MANIMN5277
Binding
Papar Back
Published Date
2023
Number Of Pages
139
Language
Telugu
Availability
In Stock
About this book

మాటకారి బిందు

బిందు మాధవ్ పాటిల్ సినిమా నటుడిలా అందంగా ఉండే యువకుడు. అతను చెక్కినట్టున్న ముఖకవళికలతో, భారీ శరీరంతో, తలమీద పట్టులాటి నల్లటి ఒత్తు జుట్టుతో ఉండేవాడు. అన్నిటికన్న ముఖ్యంగా ఎప్పుడూ చెరగని నవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు.

అతను ఎవరినీ ఎప్పుడూ ఇంటికి రమ్మనేవాడు కాదు. తనే అందరి ఇళ్ళకు వెళ్ళొచ్చేవాడు. ఒకసారి మా అవ్వ నాకు పురమాయించిన పని వలన నేను అతని ఇంటికి వెళ్ళాలిసి వచ్చింది.

నాకు అతని ఇల్లు ఎక్కడుందో సరిగా తెలీదు. అతడి ఇల్లు ఎక్కడ అని అడగడానికి సంకోచించాను. మా ఊరిలో ఎక్కడా కూడళ్ళు, పెద్ద వీధులు లేవు.

మా ఊరిలో చిరునామా కావాలంటే వర్ణించి చెప్పి తెలుసుకోవాలి. మా ఇల్లు ఎక్కడ అని చెప్పాలంటే డాక్టర్ కులకర్ణి ఇల్లు అని చెప్పేందుకు అక్కడ ముందు మా కుటుంబ చరిత్ర చెప్పాలి - 'ఆ డాక్టరు మంచివాడు. ఆయనకు ఒక తెల్ల కుక్క ఉంది. అది ఎప్పుడూ వాకిలి దగ్గర నిద్రపోతూ ఎవరేనా కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని స్నేహపూర్వకంగా పలకరిస్తుంది. కానీ ఏవేనా కుక్కలు వస్తే మటుకు చాలా చిరాకు పడుతుంది. డాక్టరుకు ఒక్కడే కొడుకు. అతను పంజాబీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు' అంటూ చెప్పుకుంటూ

రావాలి.

ఓహో! ఆ డాక్టరు కులకర్ణియా? ఎడమకి తిరిగి కుడివైపు మళ్ళి మొదట ఎడమ సందులో ఎడమ నుంచి మూడో ఇల్లు అంటారు.

అలాటి వివరాలు చెప్పి నేను బిందు ఇల్లు ఎలా కనుక్కోవాలా అని ఆశ్చర్యపోయాను.

కానీ బిందు చాలా తేలిగ్గా చెప్పేశాడు. "నల్లీ! చాలా తేలికగా కనుక్కోవచ్చు. నేతాజీనగర్ వెళ్ళే బస్సు ఎక్కు చివరిస్టాపులో దిగు. పది అడుగులు ముందుకు నడిస్తే................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?