Logili Books

Short Stories

Avyaktha Raagam

By P V R Shiva Kumar

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Avyaktha Raagam
Publisher
Pala Pitta Books Hyd
ISBN
MANIMN6280
Binding
Papar Back
Published Date
Dec, 2024
Number Of Pages
204
Language
Telugu
Availability
In Stock
About this book

ఆల్బమ్లో ఆఖరి చిత్రం

చల్లని వెన్నెల రాత్రి. పెరటిలో వేపచెట్టు కింద, విశాలమైన రాతి అరుగు మీద తండ్రి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉన్నాడు కుశమూర్తి. అతడి చేతుల్లో అట్ట మాసిన, పేజీలు నలిగిన ఆల్బమ్. అన్నాళ్ళ మానసిక ఒత్తిడికి అంతిమ చరణం పాడేసిన స్థితి అది.

సన్నగా ఒణుకుతున్న తండ్రి చేతులు తల నిమురుతుంటే, ఆ చేతులు తనలోకి పంపుతున్న శక్తితరంగాలతో ప్రభావితుడై, ఆయనతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెందుతున్న ముహూర్తం అది.

మలినమైన ఆలోచనలతో కలుషితమైన మనోకాసారం, పటికలాంటి తండ్రి ప్రేమతో తేరుకుని స్వచ్ఛంగా మారిన ఘడియలు అవి. కళ్ళు తెరిస్తే ఆ ఘడియలు కరిగిపోతాయన్నట్లు, కళ్ళు మూసుకునే సేదదీరుతూ సాంత్వన పొందుతున్నాడు.

దశరథరామయ్య కూడా కదలటంలేదు. పుత్ర గాత్ర సాన్నిహిత్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తున్నాడు. పసివయసులోనే పుత్రుడిని కోల్పోయిన తండ్రి వ్యథ ఎంతటిదో అతడికి తెలియదు.

పసివయసులోనే తండ్రిని కోల్పోయిన తనయుడి వ్యథ మాత్రం స్వానుభవం తెలిపింది. జీవితంలో ప్రతి అడుగూ, అనుభవంలోకి వచ్చిన ప్రతి సంతోషమూ, ప్రతి విషాదమూ తనకు ఉన్న ఆ లోటును ఎత్తిచూపుతూనేరాగా, ఆ లోటులేని కొడుకు తన ఒడిలో పడుకుని సేదతీరుతుంటే, చిరకాలంగా మనసు ఉగ్గబట్టుకుని ఎదురుచూసిన మధురఘడియలు విచ్చేసి, తన కోరిక తీర్చిన సంతృప్తి ఆయన మనసుని సంపూర్ణంగా ఆవహించింది................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?