• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bahujana Warriors

Bahujana Warriors By Alavala Gavarraju

₹ 300

చరిత్ర గతిని మార్చేవారే వైతాళికులు

తమ్ముడు అగరా (అలవాల గవర్రాజు) నాలుగు దశాబ్దాలుగా సామాజిక 2 సాంస్కృతి, హేతువాద రంగంలో కృషి చేస్తున్న ఆలోచనా పరుడు.

హేతువాద భావజాలంతో మూఢాచారాలపై యుద్ధం చేస్తున్న సామాజిక కార్యకర్త. తరతరాలుగా దాస్య శృంఖలాల లో మగ్గిపోతున్న దళిత బహుజన వర్గాల ప్రజల అభ్యున్నతికై ఆత్మగౌరవ పోరాటాలు నిర్మించి, త్యాగాలు చేసి ప్రాణాలను సైతం అర్పించిన జాతి వైతాళికుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన నిరంతర అధ్యయనశీలి.

ప్రతి జాతికీ వైతాళికులు చారిత్రక గమనాన్ని మేల్కొపులనూ నిర్దేశిస్తారు. మహాత్మాఫూలే, డా|| అంబేడ్కర్, నారాయణగురు, పెరియార్, రామస్వామి నాయకర్, కాన్షీరామ్ మొదలైన వారంతా ఆయా చారిత్రక మలుపుల్లో జాతిని పునరుజ్జీవనం వైపు నడిపినవారు. ముఖ్యంగా డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్దేశకుడు. డా॥ అంబేడ్కర్ మొత్తం హిందూమత వాజ్ఞ్మయానికి ప్రత్యామ్నాయంగా లక్ష పేజీలు రచించాడు. ముఖ్యంగా 'రిడిల్స్ ఇన్ హిందూయిజం'లో హిందూమత భావజాలం మొత్తం పౌరాణిక పునాదుల మీద నిర్మితమైనదనీ, అది కథనాత్మకమైనదనీ, దానికి శాస్త్రజ్ఞాన స్ఫూర్తి లేదనీ చెప్పాడు.

ఈనాడు అగరా వంటి రచయితలు ఈ ప్రత్యామ్నాయ వైతాళికులను ప్రజల ముందుకు తీసుకురావటం ఒక చారిత్రక కర్తవ్యం. వీరందరిలోని ఏకసూత్రతను అగరా మన ముందుకు తీసుకువచ్చాడు.

ముఖ్యంగా జోతిబాపూలే, గాంధీ కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పవాడు. గాంధీలోని హిపోక్రసీ, జోతిబాపూలేలో లేదు. ద్వంద్వ వైఖరిని అవలంబించిన గాంధీ హిందూ హింసావాదుల చేతిలో హతమయ్యాడు.

మహాత్మాఫూలే భావజాలం ఇప్పుడు విస్తరిస్తున్నది. కారణం దశావతారాలు హంతక పాత్రలని మొట్టమొదటిగా ప్రకటించినవాడు పూలే. ఆయన రాసిన 'గులాంగిరి' ..........................

  • Title :Bahujana Warriors
  • Author :Alavala Gavarraju
  • Publisher :Bhoomi Book Trust
  • ISBN :MANIMN5864
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024 3rd print
  • Number Of Pages :248
  • Language :Telugu
  • Availability :instock