• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhagyaraja Decoded

Bhagyaraja Decoded By Teppala Srinivas

₹ 200

గొప్ప గ్రామర్ గైడ్

భాగ్యరాజా... 89, 90లలో తెలుగు తమిళ సినిమాల్లో చాలా పెద్ద పేరు. కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం మరియు కథానాయకుడు, సంగీతం ఇలా ఎన్నో శాఖలలో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కొంత ఆలోచనని అందంగా కలిపి అందించేవారు.

ఆ రోజుల్లో భాగ్యరాజాగారి సినిమాల కోసం ప్రేక్షకులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రేక్షకులందరితోపాటు, రచయితలు దర్శకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఎందుకంటే మనకి బాగా తెలిసిన మనుషులు, మనం రోజూ చూస్తున్న మనకు ఎదురవుతున్న సంఘటనలని, చిన్న చమక్కుతో చమత్కారంగా చూపిస్తూ సుతిమెత్తగా చలాకీ చురకలు వేసేవారు.

ప్రతి సీను కొత్త మెరుపులతో గొప్ప ఆలోచనతో చెప్పేవారు. అందుకోసమే అన్ని వర్గాలవారు భాగ్యరాజా గారి చిత్రాలు కోసం ఎదురు చూస్తుండేవారు.

నేను మద్రాసు (ఇప్పుడు చెన్నై) వెళ్లిన కొత్తలో ఆయనవి పెద్ద పెద్ద కటౌట్లు ఉండేవి థియేటర్లు బయట. అంత పాపులారిటీ ఉండేది ప్రేక్షకుల్లో ఆయనకి.

ఆయన సినిమాలు అంద 7 నాట్కల్, డార్లింగ్ డార్లింగ్, ముందానై ముడిచ్చు, ఆరారో ఆరిరారో, చిన్న వీడు, రాసుకుట్టి, ఇండ్రుపోయి నాలై వా, ఇదు నమ్మాలు, తూరల్ నిన్నుపోచ్చు, ఎంగ చిన్నరాస లాంటి ఎన్నో సినిమాలు రెండు మూడుసార్లు చూసేవాళ్ళం. అవి చూస్తూ సినిమా హాల్లోనే సీనిక్ ఆర్డరు, మంచి డైలాగ్స్, స్క్రీన్ ప్లేమ్యాజిక్ గబగబా నోట్ చేసుకునే వాళ్ళం అప్పట్లో మాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ కూడా. చాలా నేర్చుకున్నాం. సినిమా చూసిన తర్వాత రూమ్స్ లోను,.......................

  • Title :Bhagyaraja Decoded
  • Author :Teppala Srinivas
  • Publisher :Jyosyula Publications
  • ISBN :MANIMN5849
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :178
  • Language :Telugu
  • Availability :instock