Logili Books

Laws and Acts

Bharateeya Sakshya Adhiniyam 2023

By Pendyala Satyanarayana

₹330
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bharateeya Sakshya Adhiniyam 2023
Publisher
LAW BOOK HOUSE
ISBN
MANIMN5439
Binding
Papar Back
Published Date
June, 2024
Number Of Pages
207
Language
Telugu
Availability
In Stock
About this book

భారతీయ సాక్ష్య అధినియం, 2023

(THE BHARATIYA SAKSHYA ADHINIYAM, 2023)
 

నిష్పాక్షికమైన విచారణకు అవసరమైన సాక్ష్యమునకు సంబంధించిన సాధారణ సూత్రములను క్రోడీకరించు నిమిత్తము ఈ చట్టమును రూపొందించటమైనది.

భారత రిపబ్లిక్ యొక్క డెబ్బది నాలుగవ సంవత్సరములో, పార్లమెంటు చేత ఈ చట్టము ఈ క్రింది విధముగా రూపొందించబడినది.

పూర్వ రంగము

ఈ చట్టము అమలులోనికి రాకపూర్వము, 'భారతీయ సాక్ష్యాధారముల చట్టము, 1872” అని ఒక చట్టము అమలులో ఉండెడిది. బ్రిటిష్ వలస పాలకుల చేత ఆ చట్టము రూపొందించబడినది. అప్పుడప్పుడు ఆ చట్టమునకు కొన్ని సవరణలు చేయబడినప్పటికి, వర్తమాన కాలమునకు వర్తించు విధముగా పూర్తిగా ప్రక్షాళన చేయబడలేదు. ఈ చట్టము సివిల్, క్రిమినల్, చట్టములకు అన్నింటికి వర్తిస్తుంది. వర్తమాన కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నూతన సాక్ష్యాధారములు చట్టమును రూపొందించవలెనని, కేంద్ర ప్రభుత్వము భావించినది. తదనుగుణముగా ఈ చట్టము రూపొందించబడినది. ఆ క్రమములో ఈ చట్టము శీర్షిక కూడా మార్చబడినది. 'భారతీయ సాక్ష్య అధినియం'గా మార్చబడింది. పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదించిన పిదప, రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన పిదప, ఈ సంవత్సరం జులై ఒకటవ తేదీ నుండి ఈ చట్టము అమలులోనికి వచ్చు విధముగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. నూతన చట్టము ఈ క్రింది విధముగా ఉన్నది:

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?