Logili Books

Religion

Bible Vrutamtalu- Nirdhistamaina Adharaalu

By Prof Turaka Nirmala Mary

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bible Vrutamtalu- Nirdhistamaina Adharaalu
Publisher
Prof Turaka Nirmala Mary
ISBN
MANIMN7043
Binding
Paparback
Published Date
Oct, 2024
Number Of Pages
98
Language
Telugu
Availability
In Stock
About this book

 పరిశుద్ధ బైబిలు - మతగ్రంథము కాదు

బైబిలు మతానికి సంబంధించిన గ్రంథము కాదని ఈ దిగువ వ్రాయబడిన అంశాల ద్వారా వ్యతిరేకించగలము. దేవుడు కలుగజేసిన ఈ మహా సృష్టిలో మానవుని జ్ఞానానికి అందని సంగతులు, రహస్యాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ఆకాశంలోని చందమామలో అణుప్రాణిని ప్రత్యక్షంగా తెలిసికోగలిగినా, అంతరిక్షంలో అద్భుతమైన టౌన్ షిప్ ప్లాన్ చేయగలిగినా, కంప్యూటర్ నెట్ వర్కింగ్ ద్వారా ప్రపంచ పటాన్ని ఒక కుగ్రామంగా మార్చివేయగలిగినా, కృత్రిమ మేధస్సుతో వింత కార్యాలు జరుపుతున్నా చిరకాలంగా మనిషిని అసంతృప్తి వెంటాడుతూనే వుంది. సృష్టి ఆవిర్భావం గురించి ఎన్నో పరిశోధనలు ఎడతెరిపి లేకుండా జరుగుతూనే వున్నాయి. దేవుడు వున్నాడని లోకం అంటున్నా, ఎక్కడ, ఏ రూపం అని నిరూపించలేకపోతుంది. ఇదే అంశాన్ని బైబిలు దేవుని వాక్యము ద్వారా, స్పష్టం చేస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానం తెలిసికోవడంలో అంతరిక్ష పరిశోధనలలో ఆరితేరిన దేశాలు కూడ అధమ స్థాయిలోనే వున్నాయి. శాస్త్రవేత్తలు మేము జ్ఞానులం, మేధావులం అని చెప్పేవారంతా సృష్టి రహస్యాల గురించి తెలిసికొన్నది చాలా తక్కువే. కేవలం సైన్సు విజ్ఞానంతోనే సృష్టి కథనాన్ని తెలిసికోగలరు అన్నది అసాధ్యమే. మరి ఏది సత్యం? ఏది నిత్యం ఆదియు అంతము, ఆల్ఫయు, ఓమేగయునైయున్న దేవుడు మాత్రమే. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దాగియున్న నిగూఢ సత్యాలను, ప్రవచనాలను అనేక సాక్ష్యాధారాలతో ఋజువు పరచే సత్య గ్రంథమే ఈ బైబిలు గ్రంథము. ఇది పరిశుద్ధమైన గ్రంథము. దీని గ్రంథకర్త పరిశు ద్ధాత్మ (యెషయా 6:3; 1 పేతురు 1:14), ప్రకటన 4:8). ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదియు నీతి గలదియు, ఉత్తమమైనదియునైయున్నది (రోమా 7:12). కాబట్టి ఆయన మాటలు పరిశుద్ధమైనవి. వ్రాసిన వారు పరిశుద్ధులు (అ.కా. 3:21, పేతురు 3:2). 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ బైబిలు గ్రంథాన్ని నలుబదిమంది పండితులు, పామరులు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, రాజులు వివిధ దేశాలలో నుండి (పాలస్తీనా, బబులోను, ఐగుప్తు, ఐరోపా మొదలైనవి) వివిధ పరిస్థితులలో వ్రాసినను భావాలు, సంధర్భాలు పుస్తకాలనందలి విషయాలు ఎక్కడ వ్యతిరేకతలు లేకుండా ఐక్యత కనిపిస్తుంది.

ధర్మ శాస్త్రము పరిశుద్ధ లేఖనములను కలిగియున్నది (రోమా 1:7, 7:12, 2తిమోతి 3:15). దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును,...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?