• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kulapuranalu Asritavyavastha

Kulapuranalu Asritavyavastha By Pulikonda Subbachary

₹ 330

కైమోడ్పులు

జానపదశాస్త్ర రంగంలోకి నేను రావడానికి ప్రేరణ కలిగించిన గురువర్యులు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు. నా పరిశోధన కార్యక్రమం అంతటికీ మార్గనిర్దేశనం చేసింది వారే. వారి పర్యవేక్షణలో పరిశోధన చేయడం ఒక Rigorous academic exercise మాత్రమే కాదు, ఒక Human touch తో కూడిన Pleasant experience కూడా. అప్పటికీ, ఇప్పటికీ నా వెన్నంటి ముందుకు నడిపిస్తున్నది. వారు, వారికి కృతజ్ఞతతో నిండిన హృదయపూర్వక నమస్కారం. జానపదరంగంలో నాకు స్ఫూర్తినిచ్చిన మరో గురువుగారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. నేను ఈనాడిలా ఉండడానికి ఒకరకంగా వారే కారణం. వారు చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకోదగింది. వారికి గుండెనిండైన కైమోడ్పు.

పాఠాలు చెప్పింది కొద్ది కాలమైనా ప్రభావం వేసింది కాలం పొడుగునా. ఆ ప్రతిభాభాస్కరుడు ఆచార్య సి. నారాయణ రెడ్డిగారు. క్షణక్షణం చైతన్యంతో జీవించాలని, వారిని చూచి నేర్చుకున్న పెద్దపాఠం. వారికి నా నమోవాకం.

మౌఖిక సంప్రదాయ పరిశోధనకు సంబంధించిన మౌలిక జిజ్ఞానవైపు మలుపు తిప్పిన వారు, నేను అంతర్జాతీయ శిక్షణ పొందడానికి కారకులు ఆచార్య చేకూరి రామారావుగారు వారికి నమస్కారం. మరొక గురువర్యులు.................

  • Title :Kulapuranalu Asritavyavastha
  • Author :Pulikonda Subbachary
  • Publisher :Pulikonda Books
  • ISBN :MANIMN4657
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023 2nd Print
  • Number Of Pages :317
  • Language :Telugu
  • Availability :instock