• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gathichani Gatham

Gathichani Gatham By Chava Sivakoti

₹ 90

Description

"గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.

సూర్యుడు లేత ఎరుపు పసుపు రంగులు వులిమిన ముద్దలా తూరుపునుంచి బయటపడుతున్నాడు. పొద్దు సాగిన కొద్దీ కిరణాలు వేడిని పుంజుకుంటున్నాయి. నీరెండ ఎండగా పండటానికి ఆట్టే వ్యవధి పట్టడం లేదు. ఈ చరాచర వర్తనానికి వెలుగును ప్రసాదించేది, జీవికకు జీవాధారమయినది, కారుచీకటిని పారద్రోలేది ఈ ఎర్ర ముద్దే.

'అసలెవ్వరయ్యా ఈ సూర్యుడు? ఏదో ఆరిపోయినట్టు, తన పుట్టేదో మునిగిపోయినట్టు అంత నియమంగా క్రమం తప్పకుండా నడుస్తాడెందుకు? ఆయనకు వేరే పనీ పాటా లేదా?” అంటే - అదంతే.

దీనికి సమాధానం లేదు. 'సృష్టి ఎన్నడు మొదలయినా, దీని గమనాన్ని గమనించినప్పటినుంచి ఈ మహానుభావుని నడకను బేరీజు వేసి 'ఇలా ఉన్నాడు, ఇలా ఉండేవాడు' అని చెపుతారు తప్ప అసలీయన ఎవరో ఎందుకలా ఆగక పరిగెడుతున్నాడో మాత్రం చెప్పరు. ఒకవేళ ఏ మహానుభావుడయినా చెప్పినా ఇదో గ్రహమని ఊరుకుంటాడు, ఇహ చెప్పేదేమీ లేనట్లు. ఇంతేనా అని మనం చూస్తే మాత్రం ఈ బ్రహ్మాండ భాండం పగిలి ముక్కలయ్యిందని; ఆ ముక్కలే శూన్యాన నిలిచాయనీ; అవే భూమి, సూర్యుడు, 'కుజుడు, గురుడు వగైరా అనియును...

అప్పటినుంచి ఆయనకి ఇదే పని. ఒక్క విఘడియ కూడా తేడా పడలే. ఇక సెలవలు, అలకలు, రోగాలు, రొషులు బొత్తిగా తెలియవు. ఆయన కనుసన్నల్లోనే జీవరాశితో పాటు మనిషి పుట్టాడు. ఇంకా పుడుతున్నాడు. బ్రతుకుతున్నాడు. ఈ బ్రతికిన కొద్దికాలంలో ప్రేమించడం, ద్వేషించడం, సంతానాన్ని కనడం, పెంచడం, ఆరాధించడం, అన్యాయం చేయడం, చంపడం, ఆదుకొనడం. ఇక ఈ బ్రతికిన నాలుగునాళ్ళలో బ్రతుకు తెరువు అన్వేషణ, ఆరాట పోరాటాలు, తత్పలితమే మనిషీ వాడి కథ... ఇతని పుట్టుకనించి పుడకల్లోనికి వెళ్ళి దాకా నడిచేది - గడిచేది వాడి...................

  • Title :Gathichani Gatham
  • Author :Chava Sivakoti
  • Publisher :Sahithi Prachuranalu
  • ISBN :MANIMN3371
  • Binding :Papar Back
  • Published Date :june, 2022
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock