స్పందన- -1
| గౌరవనీయులైన శ్రీయుత జయదేవ్ గారికి నమస్కృతులు.
హెలో! సెర్!! గ్లాచ్చు మీచ్యూ!!!
ఈ అక్షర ధాన్యపు రాశిలో వాసిగల గట్టి గింజలను ఉంచుకోండి. నాసిరకపు పాలు, గింజలను పారేయండి. మీలాంటి హనుమంతుని ముందా నాలాంటి వాని కుప్పిగంతులు? అయితే వానరం కుప్పిగంతులు వేస్తోంటే చూడటానికి భలే సరదాగా వుంటుంది గదూ! ఆ భావనలో enjoy చేయగలరెమో Try చేయండి.
"గ్లాచ్చు మీచ్యూ”ను ఆసాంతరం చదివాను. అయస్కాంతంలా ఆకర్షించింది. ఈ పొత్తము త్వరలో / అతిత్వరలో పునర్ముద్రణ పున్నెం నోచుకుంటుందని నా నమ్మకం.
దాని గురించి లోగడ వ్రాసినవి కాక మరికొన్ని విషయాలను, మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. లోగడ వ్రాసిన ఆఱు కార్డులలోని కొన్ని విషయాలను, ఈ మధ్య పంపిన “శుభాభినందన స్తోత్రమ్"ను, దీనితో జతపరచిన కొన్ని విషయాలను పునర్ముద్రణ పుస్తకంలో ప్రచురించడం కాని, పునర్ముద్రణ సంచిక ఆవిష్కరణ సభలో ఉటంకించడం కాని చేయవచ్చు.
నా మదిలో మెదిలిన అభిప్రాయాలను నిక్కచ్చిగ వ్రాస్తున్నాను. మీకు నచ్చితే సరే. మీ మనసు నొచ్చితే సరికి సరి, ఇంతే సంగతులు. ఎందుకంటే మీలో గల నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థత, నిక్కచ్చితనము నిలువెత్తు దర్పణంలా గోచరించాయి.
ఈ పుస్తకమును మీరు ఎంతో దూరదృష్టితో, పకడ్బందీగా, పక్కాగా సిద్ధం చేసుకొని వ్రాసినట్లనిపిస్తుంది. ఇందుకు మీ నియమబద్ధ జీవనం, నియమానుసార కాలనిర్ణయం, మీ Artist హృదయం బాగా దోహదపడినవని భావిస్తున్నాను.
ఈ మధ్యకాలంలో వస్తున్న పుస్తకాలలో ముద్రారాక్షసముల సంఖ్యతో పోల్చితే ఈ పుస్తకంలో చాలా చాలా తక్కువ వున్నవి. వానిని కూడ మీ దృష్టికి తీసుకు వస్తున్నందుకు నన్నేమీ అనుకోకండి. అవి చాలా చాలా తక్కువ. ఈ పుస్తకంలో భాషాపరమైన దోషాలూ, వాక్యనిర్మాణ దోషాలు ఏమీ లేవు.
ఇకపోతే, మీరు 100% నిజాయితీతో జరిగిన సంఘటనలు జరిగినట్లుగా వ్రాసారు. అందుకు మిమ్ములను ప్రగాఢంగా అభిమానించాలి. కాని ఈ పుస్తకమును....................