|
అమృతపు చినుకులు - రసమయ గుళికలు "సంసార విషవృక్షస్య ద్వే ఏవ రసవత్సలే! కావ్యామృత రసాస్వాద: సల్లాపః సజ్జనై స్సహ||" ఈ సంసారమనే విషపూరితమైన చెట్టుకు అమృతోపమానమైన తీయని పండ్లు రెండే ఉన్నాయట. వాటిలో ఒకటి కావ్యాన్ని లేదా సాహిత్యాన్ని ఆస్వాదించడం కాగా రెండవది సజ్జనులతో కలిసి సత్సంగం చేయడం. ఉత్తమమైన సాహిత్యాన్ని చదివి, అర్థం చేసుకొని, నిరుపమానమైన ఆనందాన్ని అనుభవింప గలగడం ఒక యోగం. అత్యంత దుర్లభమని పెద్దలు పేర్కొన్న... మానవజన్మ లభించడం, అక్షరాస్యుడు కావడం, మంచి సాహిత్యాన్ని చదవాలనే ఆసక్తిని కలిగి ఉండడం, చదివిన సాహిత్యాన్ని - అందులోని స్వారస్యాన్ని ఆకళింపు చేసుకొని ఆనందింపగలగడం పురాకృత సుకృత విశేషమనక తప్పదు. తానొక్కడే ఆ రసానందాన్ని పొందాలనే స్వార్థం లేకుండా నలుగురికీ ఆ ఆనందాన్ని పంచి వారినీ పరవశింపచేయాలనేది విశిష్ట మైన గుణం. ఆ గుణం మన అసామాన్య శేముషీమూర్తి శ్రీ ఉమామహేశ్వరన్ గారికి సహజ లక్షణంగా అలవడింది. వారు పంచే సహితమైన సంతోషాన్ని అందిపుచ్చుకుంటూ ఆనందంతో తబ్బిబ్బయ్యే సన్మిత్రబృందం తన చుట్టూ ఉండడం శ్రీ ఉమామహేశ్వరన్ గారి బలం. "నవ్వుల సమయం" పేరిట వారం వారం సమావేశమై ఆ మిత్రబృందం ఆనందాల విరిజల్లులలో తడిసి తన్మయత్వం చెందడాన్ని ప్రత్యక్షంగా చూడడం మా దంపతుల అదృష్టం.................... ----------------- జ్ఞాన గుళికలు-హాస్యపు గిలిగింతలు |