హోమం
భూమి తనలో తాను తిరుగుతూ- అనంతకాలాన్ని పుట్టిస్తుంది. సూర్యుణ్ణి చుట్టేస్తూ సంవత్సరానికి ఋతువుల్ని కల్పిస్తోంది.
సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. పడమర అస్తమించాలి గాని ఉదయించ కూడదు. అది సృష్టి విరుద్ధం. ఈ భూమి, ఆకాశం, అనంత నక్షత్రాలు ఇదంతా ప్రకృతి, ప్రకృతి నుంచి సృష్టి జరుగుతోంది.
ఆ సృష్టి వెనుక ఒక శక్తి ఉంది. ఆ శక్తే భగవంతుడు. ఈ సృష్టికి నియమాలున్నాయి. నియమ ఉల్లంఘన జరగదు. జరిగితే... అదే విలయం... అదే ప్రళయం...
చెట్టుకు ఆకు పుడుతుంది. పండుటాకు రాలిపోతుంది. పువ్వు కాయవుతుంది. కాయ పండై రాలుతుంది. ఏ విత్తుకు ఆ మొక్కే మొలుస్తుంది. వేరే మొక్క మొలవదు. పక్షులు ఆకాశంలో ఎగరాలి. జంతువులు నేలమీదే తిరగాలి. జలచరాలు నీటిలో బతకాలి. ఇవన్నీ ప్రకృతి నియమాలే.........................