• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kalabhairava Homam

Kalabhairava Homam By Hemambari Shivatmika

₹ 360

కాలభైరవ హోమమ్

అష్టభైరవులు మొదటి స్వరూపం అసితాంగ భైరవ స్వామి... సృజనాత్మకత రంగంలో గొప్ప నైపుణ్యాన్ని సాధించడానికి అసితాంగ భైరవ స్వామి ఆరాధన చేయాలి.

కాలభైరవ తత్త్వం అనేది శివుని యొక్క అత్యంత తీక్షణ రూపం, అనగా వెంటనే కరుణించి కాపాడే దేవాదిదేవుడు, మహాదేవుడు. చెడును అణిచివేయడానికి, ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి మరియు చుట్టూ సానుకూలతను వ్యాప్తిచేసే శక్తి అతనికి ఉంది. ఈ కాలము ద్వారా వచ్చే సమస్త సమస్యల నుంచి కాపాడుతున్నారని మరియు దిశలను అనగా దిక్కులను నియంత్రిస్తున్నారని ఆయనకి కాలస్వరూపుడు, కాలరాజ, కాలపురుషుడు, కాలునికే కాలుడు అంటే మృతువుకు కూడా కాలభైరవుడు అంటే భయం అని పేరు ఉంది. కాలభైరవుడు కాలానికి అధిపతిగా, ప్రభువుగా ఉంటాడు. దేవాలయాలలో ప్రధాన దేవతగా శివునిగా, రుద్రునిగా, ఈశ్వరునిగా, శక్తిగా గర్భగుడిలో సమస్త పూజలు అందుకుంటూ ఆయనే ఆ క్షేత్రానికి క్షేత్రపాలకునిగా, సంరక్షణశక్తిగా భక్తుల పాపాలనను హరించి, మంత్ర సిద్ధిని ప్రసాదించే దేవతగా కూడా అనుగ్రహిస్తున్నాడు మరియు అందువల్ల ప్రధాన మందిరానికి తాళం వేసిన తర్వాత, దాని తాళాలు అతని అదుపులో ఉంచడం పురాతన సాంప్రదాయ పద్ధతి... భైరవతత్త్వంలో ఎనిమిది దిక్కులకు ఎనిమిదిమంది భైరవమూర్తులు శివునియొక్క చాలా ముఖ్యమైన రూపాలుగా ఉన్నాయి. ఈ ప్రముఖ రూపాలను కలిపి అష్టభైరవ శక్తులు, అష్టభైరవ కోణాలు అంటారు. వారు ఎనిమిది దిక్కులను పరిపాలిస్తారు. అష్టభైరవమూర్తులు 8 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, ఆగ్నేయ, నైఋతి, వాయువ్య దిక్కులనే కాక ఎనిమిది దివ్య అంశాలను కూడా నియంత్రిస్తూ సమస్త జగత్తును అనగా ప్రకృతిని, కాలాన్ని కాపాడుతూ కోటాను కోట్ల నిఘా...........

  • Title :Kalabhairava Homam
  • Author :Hemambari Shivatmika
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4132
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :305
  • Language :Telugu
  • Availability :instock