కార్ల్ మార్క్స్ 1859
అర్థశాస్త్ర విమర్శ
ముందు మాట
పెట్టుబడి, భూ ఆస్తి, కూలి పని, రాజ్యాంగ యంత్రం, విదేశీ వాణిజ్యం, ప్రపంచ మార్కెట్ : ఈ వరసలో నేను బూర్జువా ఆర్ధిక వ్యవస్థను పరిశీలిస్తాను.
ఆధునిక బూర్జువా సమాజం మూడు పెద్ద వర్గాలుగా విడివడి ఉంది. ఆ వర్గాల జీవన ఆర్ధిక పరిస్థితుల్ని పెట్టుబడి, భూసంపద, కూలి పని అనే శీర్షికల కింద పరిశీలిస్తాను. ఈ మూడింటికీ రాజ్యాంగ యంత్రంతో విదేశీ వాణిజ్యంతో ప్రపంచ మార్కెటుతో ఉన్న అంతస్సంబంధం స్పష్టమే. మొదటి పుస్తకం మొదటి భాగంలో పెట్టుబడి శీర్షిక కింద ఈ అధ్యాయాలుంటాయి: 1. సరుకు 2. డబ్బు, లేదా చలామణి 3. స్థూలంగా పెట్టుబడి. ప్రస్తుత భాగంలో మొదటి రెండు అధ్యాయాలుంటాయి. మొత్తం విషయమంతా రాత ప్రతుల రూపంలో నా ముందుంది. వేర్వేరు అంశాలపైన వేర్వేరు సమయాల్లో రాసి పెట్టుకొన్న రాత ప్రతులివి. వీటిలో ఒకదానికీ మరోదానికీ మధ్య ఎంతో విరామం ఉంది. ఇవి ప్రచురణ కోసం ఉద్దేశించిన రాతలు కాదు; కేవలం సొంత స్పష్టతని సాధించడం కోసం రాసుకొన్నవి. నేను ఇంతకుముందు సూచించిన పధకం ప్రకారం వీటిని ఒకే మొత్తంగా మలుచుకోవాలి. పరిస్థితులను బట్టే ఆ పని చేస్తాను.
నేను అంతకుముందు స్థూలంగా ఓ పరిచయం రాశాను. కాని ఆలోచించగా రుజువుచేయాల్సిన ఫలితాల్ని అది ముందే ఊహించినట్టుగా ఉంటుందనీ పాఠకునికి అది గందరగోళంగా ఉంటుందనీ అనిపించింది. అందుకే దాన్ని తీసేశాను. పైగా నన్ను అనుసరించాలనుకొనే పాఠకుడు ప్రత్యేకం (particular) నుంచి సామాన్యం (general) వైపు ముందుకు సాగటానికి నిర్ణయించుకోవాలి. నా రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం గురించి ఇక్కడ రెండు ముక్కలు చెప్పడం సబబుగా ఉంటుంది. నేను తత్వశాస్త్రానికీ చరత్రకీ అనుబంధంగా న్యాయశాస్త్రం అధ్యయనం చేశాను................................