• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Konguchaatu Krishnudu

Konguchaatu Krishnudu By Yandamuri Veerendranath

₹ 120

ఉపోద్ఘాతం

రంభ, ఊర్వశి, తిలోత్తమలు ముగ్గురూ కలిసి ప్రారంభించిన 'మన్మథా 'మెన్స్ బ్యూటీ పార్లర్' మూడు గెద్దాలూ, ఆరు ఫేషియల్స్ గా విస్తరిస్తోంది. రిసెప్షన్లో ఊర్వశి కూర్చుంటూ ఉండటంతో మగాళ్ళు కిటకిటలాడారు. మూడు నెలలు తిరక్కుండానే దాని డిమాండు ముల్లోకాలూ దాటి పోయింది.

అప్పుడే ఆడవారి కోసం మరో బ్రాంచ్ ప్రారంభించారు. అక్కడ క్యాష్- కౌంటర్లో రంభ తన బాయ్ ఫ్రెండూ, గొప్ప అందగాడూ అయిన నలకూబరుడిని కూర్చోబెట్టటంతో దేవకన్యలు క్యూ కట్టారు. అందం త్రిగుణీకృతం చేసుకోవటానికి అతిలోక సుందరులైన అప్సరసలు కూడా వచ్చి వెళ్తూ ఉండటంతో ఆ బ్రాంచి కూడా అఖండ -7 సినిమాలా అద్భుతంగా నడుస్తోంది.

ఈ బ్రాంచీల వల్ల నష్టపోయింది విశ్వామిత్రుడు ఒక్కడే. మేనక కూడా తన స్వంత క్లినిక్ ప్రారంభిస్తుందేమో అన్న భయంతో సగము దివ్యదృష్టి (అంటే - ఒక కన్ను) అటు పెట్టటంతో తపస్సు సరిగ్గా సాగటం లేదు.

ఆ రోజు మూడో బ్రాంచి ప్రారంభం. దాంతో పాటూ, రెండో పార్లర్ ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా "మేడ్ ఫర్ ఈచదర్" పోటీ. ఇలాంటి పోటీ పెట్టాలన్న ఆలోచన రంభది. రంభది బిజినెన్స్ మైండ్..! ఇంద్రసభలో నాట్యం చేస్తున్నప్పుడు కూడా వ్యాపారం గురించే ఆలోచిస్తుంది.

ఒకరోజు ఇంద్రసభలో నాట్యప్రదర్శన కోసం ఆమె వెళ్తూ ఉండగా, అప్పుడే భూమ్మీద బాల్చీ తన్ని స్వర్గానికి వచ్చిన ఒకావిడ, పైకి రాబోయే ముందు చూసిన ఆఖరి సినిమా హిట్ సాంగ్ "పెదవి మీద ముద్దు పెట్టు - తేనె చుక్క రాలినట్టు: వీపు మీద ముద్దు పెట్టు ముద్దు పెట్టు - గడ్డ పెరుగు చిలికినట్టు, బుగ్గ మీద ముద్దు పెట్టు - పట్టు చీర వెన్నపూస కరిగేటట్టు; నడుము మీద................

  • Title :Konguchaatu Krishnudu
  • Author :Yandamuri Veerendranath
  • Publisher :Nava Sahity Book House
  • ISBN :MANIMN5274
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :231
  • Language :Telugu
  • Availability :instock