Logili Books

Devotional and Religion

Mahimalayam

By Punati Ravindra Babu

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mahimalayam
Publisher
Shneha Kala Sahity Prachuranalu
ISBN
MANIMN6892
Binding
Hard Bainding
Published Date
March, 2026
Number Of Pages
188
Language
Telugu
Availability
In Stock
About this book

కవి రచయిత

అప్పుడెప్పుడో ఏనుగుల వీరాస్వామి 'కాశీయాత్ర' తరువాత మొన్నా నిన్నటి మాచవరపు ఆదినారాయణ 'భ్రమణకాంక్ష' దాకా ఆపై మిత్రుడు దాసరి అమరేంద్ర... ఇంకా ఎందరో తమ తమ యాత్రా విశేషాల్ని రాసేరు. రాస్తూ వస్తున్నారు. 'విపులాచ పృధ్వీ...' ఎందరు ఎంత తిరిగొచ్చినా... ఆ అనుభవాలను అక్షరబద్ధం చేస్తున్నా చెప్పాల్సిందెంతో...!? ప్రతి వొక్కరూ తమ తమ ప్రయాణాల్ని సాహిత్యీకరిస్తే ఎంత బాగుంటుందో...!

యాత్రాసాహిత్యానికొక ప్రత్యేకత ఉంది. అందరూ అన్ని ప్రాంతాలనూ దర్శించలేరు. ప్రపంచ పర్యాటకులు, పర్వతారోహకులు తమతమ స్వీయానుభవాల్ని అక్షరబద్ధం చేయడం ద్వారా ప్రపంచమెంత వైవిధ్యభరితమో, ఎంత సౌందర్యవంతమో విశ్వానికి చాటినట్లవుతుంది. తామున్నచోటే ప్రపంచంగా భావించే ఎందరికో విశ్వదర్శనం గావించే యాత్రాసాహిత్యం ఎంత విస్తృతమైతే అంత మంచిది.

ఇప్పుడు అమెరికాలో 'ప్లెసెంటన్' కాలిఫోర్నియాలో ఉన్న ప్రకాశం జిల్లాలోని `రావినూతల'కు చెందిన తెలుగు మిత్రుడు 'పూనాటి రవీంద్రబాబు' తన సహచరి, తన కుమార్తెతో కలిసి చేసిన యాత్రానుభవాల్ని, హిమాలయాల్లో తన ప్రయాణాను భవాల్ని ‘మహిమాలయం' పేరుతో పుస్తకంగా తెస్తున్నారు. హిమాలయాల పేరు వినడమేగాని దర్శించలేని నాలాటి ఎందరికో కళ్లకు కట్టినట్టుగా చిత్రించిన ‘మహిమాలయం' పాఠకులను తనతోపాటు హిమాలయాల్లో తిప్పి ఆ అనుభవమేదో మనది కూడా అనిపించేలా చేస్తుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా నుండి నేపాల్లోని హిమాలయ పర్వతశ్రేణులను అధిరోహించాలనే భ్రమణకాంక్షతో చేసిన తన ప్రయాణానుభవం చదవడమొక అనుభవం. ఎక్కడా ఆపాలనిపించకుండా ఏకబిగిని చదివించే శైలి, వర్తమాన విశేషాలతోపాటు గతస్మృతుల్నీ సమన్వయం చేస్తూ తన పుట్టిన ఊరునూ, తన బాల్య కౌమార యవ్వన కాలాల పల్లె జ్ఞాపకాలను, మిత్రులతో తన అనుబంధాన్నీ, వివరిస్తూ... మంచుకొండల చలిదారిలోని దృశ్యాలను, అక్కడ తననాకర్షించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, కళా ఖండాలను చక్కని ఛాయాచిత్రాల్లో పొందుపరిచి మన కళ్లకు విందు చేస్తారు............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?