Logili Books

Poetry

Manucharitra

By Allasani Peddana

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manucharitra
Publisher
Emesco Books pvt.L.td.
ISBN
MANIMN5090
Binding
Papar Back
Published Date
Jan, 2024
Number Of Pages
376
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీరస్తు
 

మనుచరిత్ర

ప్రథమాశ్వాసము

 

అవతారిక

ఇష్టదేవతా వందనము

సనకసనందనాదుల భ్రాంతి:

శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతి న్ని ల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా
జీవాక్షుండు గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్.

అర్ధాలు: శ్రీవక్షోజ = లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న; కురంగనాభము = కస్తూరీ పరిమళద్రవ్యం; ఎదపైన్ = రొమ్ముపై; చెన్ను+ఒందన్ = అందంగా ప్రకాశిస్తుంటే; విశ్వంభరాదేవిన్ భూదేవిని; తత్+కమలా సమీపమునన్ = ఆ లక్ష్మీదేవి చెంత; ప్రీతిన్ = ప్రేమగా; నిలిపినాడో= ఉంచాడో; అనంగాన్ = అనేటట్లు; వందారు = నమస్కరించే; నిజభక్తశ్రేణికిన్ భక్తకోటికి; తోచు = కనిపించే; రాజీవ + అక్షుండు = పద్మాల వంటి నేత్రాలు గల శ్రీమహావిష్ణువు; కృష్ణరాయ+అధిపున్ = శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తిని; కృత+ అర్జున్ ఇష్టసిద్ధి కలిగేలాగ; చేయున్ = చేయుఁగాక!

తాత్పర్యం: లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న కస్తూరి, ఆమెను కౌగిలించుకున్న శ్రీమహావిష్ణువు వక్షఃస్థలంపై అంటుకొంది. అలా అంటుకున్న కస్తూరి, విష్ణువుకు నమస్కరించే సనకసనందనాది భక్తులకు ఎలా కనిపించిందంటే శ్రీదేవితోపాటు భూదేవిని కూడా, తన వక్షాన శ్రీమహావిష్ణువు నిలుపుకొన్నాడా? అన్నట్లుగా. అటువంటి శ్రీమన్నారాయణుడు, ఈ కావ్యానికి భర్తయైన శ్రీకృష్ణదేవరాయలను శుభదృష్టితో చూచి, ఇష్టసిద్ధిని కలిగించుగాక!..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?