Logili Books

Poetry

Vennela Ginjalu

By Chittiprolu Subbarao

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vennela Ginjalu
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6256
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
263
Language
Telugu
Availability
In Stock
About this book

నిశ్చయార్థకం

కవిత్వం రాయడానికి కవికేం కావాలి? మామూలు కవికయితే, ఏదో కవిననిపించుకుంటే చాలుననుకుంటే కొన్ని మాటలుంటే చాలు, వాటిని కొంచెం అందంగా పేర్చుకుంటూ పోతే చాలు. ఈ అందం కోసం ప్రాసలూ, అనుప్రాసలూ కొంచెం కష్టపడి తెచ్చుకోవచ్చు. వాటి ఔచిత్యానౌచిత్యాల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు.

కొంచెం మంచికవికి కవితా హృదయం అవసరం. చుట్టూ ఉన్న ప్రపంచంలోని అందాన్ని చూడగలిగితే చాలు, అందమైన ఊహలు, కల్పనలు కావాలి. తను చూసిన అందాన్ని పాఠకుడి అనుభూతిలోకి తేగలగాలి. అంత వరకు చాలు.

నిజంగా మంచికవి కావాలంటే ప్రపంచాన్ని చూసే దృక్పథం కూడా కావాలి. ఒక తాత్త్వికత ఉండాలి. ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటికీ స్పందించగలగాలి. దుఃఖంలో దుఃఖమై పోవాలి, సుఖంలో సుఖమైపోవాలి. తాత్త్వికత ఉన్నప్పుడు కవి మొత్తం విశ్వ అస్తిత్వానికి కారణం గురించి ఆలోచిస్తాడు. పరిణామక్రమాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వర్తమానాన్ని సవిమర్శకంగా పరిశీలిస్తాడు, భవిష్యత్తును దర్శించే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా కవి మేధలో నిక్షిప్తమైపోతుంది. ఈ నిక్షిప్తమైపోయిన తాత్త్వికత దృష్టితోనే తాను చూసిన ప్రపంచాన్ని మనకు దర్శింపచేస్తాడు. తన అనుభవాలను సాధారణీకరిస్తాడు, అంటే ఆ అనుభవాలు మనవే అవుతాయి. కవి కవిత్వం మనదే అవుతుంది.

చిటిప్రోలు సుబ్బారావుగారు తన ఈ 'వెన్నెల గింజలు'కు అభిప్రాయం రాయమని అడిగినప్పుడు అటువంటి అవసరం ఒకటి ఉందా అని అనిపించింది. పుస్తకాన్ని, దానికి ఆయన రాసుకున్న 'నా అంతరంగాన్నీ చదివిన తర్వాత దాని అవసరం లేదన్న అభిప్రాయం దృఢపడింది. ఆయన అంతరంగం ఆయన తాత్త్వికత. ఇంచుమించుగా నా ఆలోచనలూ అదే దారిలో ఉండడం వల్ల దాని గురించి ఏమి రాసినా అది పునరుక్తే అవుతుంది. ఇక కవిత్వం గురించి. ఈ కవిత్వం ఆ తాత్త్వికతకు ప్రతిఫలనమే. అక్షరాలను కవిత్వంగా మార్చడానికి ఈ కవికి ప్రయత్నం....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?