Logili Books

Novels

Martha Chalam Sahityam Navalalu

By Chalam

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Martha Chalam Sahityam Navalalu
Author
Publisher
Amaravti Publications
ISBN
MANIMN6965
Binding
Paparback
Published Date
Sep, 2025
Number Of Pages
182
Language
Telugu
Availability
In Stock
About this book

మార్తా

పగలంతా మంచి ఎండకాసింది. ఆ ఎండలో పరిగెత్తారు; ఎవరో ఏసు అనే దేశదిమ్మరి సాధు మా వూరువొచ్చి వూరిబైట దిబ్బమీద బోధిస్తు న్నాడని. ఇళ్లల్లోంచి, పొలాల్లోంచి పనిపాటలన్నీ మాని పరిగెత్తారు, జబ్బు మనుషుల్ని కూడా మోసుకుంటో. వూళ్లో ఒక్క పిట్టలేదు. అతను చాలా మహత్యాలు చేస్తాట్ట. గుడ్డివాళ్లకి చూపునిచ్చాట్ట. చచ్చిన వాళ్లని బతికిం చాడట. ఇట్లాంటివన్నీ నమ్ముతారు వీళ్ళు. గుడ్డివాళ్ల కళ్లు బాగు చెయ్య డానికీ, కుష్టు కుదర్చడానికీ ఆయన దగ్గిర ఏవన్నా మందులున్నాయేమో, కాని చచ్చినవాళ్ల నెట్లా బతికిస్తాడు. వీళ్ల వెర్రికాని! ఏమైనా అతన్ని చూడ్డానికి, అతని బోధ వినడానికీ, ప్రతి వూళ్లోనూ ప్రజలు తండోప తండాలుగా వెడుతున్నారుట. కాని ఇంతటి మహాత్ముడూ, పాపుల్నీ, సమరీయుల్నీ, వేశ్యల్నీ చేరతీసి వాళ్లతో తిరిగి, తింటాడుట. అదేం పోయే కాలమో!

వీళ్లందరితో లాజరూ పరిగెత్తాడు. మరియు కూడా బైలుదేరింది. కాని నేను ఆపేశాను. అసలే అర్భకురాలు; ఆ ఎండలో జనం వొత్తిడిలో ఏమైపోతుందోనని. రాత్రవుతో వుండగా వొచ్చాడు లాజరు మిత్రులతో కలిసి. వాళ్లుదవొచ్చి కూచున్నారన్నమాటేగాని, వాళ్ల వొళ్లు తెలీనంత ఆగ్రహంలో వున్నారు. అతను పరిసయ్యుల్ని ఒకటే తిడతాట్ట. లాజరు మిత్రులందరూ పరిసయ్యులు. “ఒరే పరిసయ్యుల్లారా, సద్దు కయ్యుల్లారా, కపటులారా మీకు నాశనం" అని శపిస్తాడుట. మేము బీదవాళ్లం.. కాని లాజరు ఆ పరిసయ్యుల ధనవంతుల కుర్రాళ్లతో తిరుగుతోవుంటాడు. వాడు తిరగడమేమిటి? వాళ్లే వాణ్ణి లాక్కుపోతోవుంటారు. లాజరు ఏంలేదని నవ్వుతాడు గాని వాళ్లలో ఓ గొప్పింటి పిల్ల లాజర్ని వొలిచిందట. పెళ్లి............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?