మూక
పెద్ద పెద్ద అడుగుల శబ్దంతో మహర్వాడ వైపుగా ఓ గుంపు వెళుతూ ఉంది. అందరి ముఖాలూ రౌద్రంగా ఉన్నాయి. చేతుల్లో కొడవళ్ళూకత్తులూ ఉన్నాయి. ‘పట్టుకో వాణ్ణి, వదలొద్దు కొట్టు కొట్టు' అనే కేకలతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది.
వాడ మేలుకుంది.
ఉన్నట్టుండి గుడిసెలు తగలబడిపోయాయి. చుట్టూ మంటలు... తన తల్లి హృదయవిదారకంగా ఏడవడం సుధామకి వినిపించింది. వాడలోకి వచ్చిన గుంపు అతని తండ్రిని ఒక్కసారిగా ఎత్తి ఎగసిపడుతున్న మంటల్లోకి విసిరేశారు. నిప్పు రవ్వలు ఆకాశానికి ఎగజిమ్మాయి. సుధామ భయంతో వణికిపోయాడు.
ఆ దృశ్యాన్ని చూసిన సుధామ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఆ గుంపు తన వైపుకి రావడం చూసి సుధామ, తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం అక్కడి నుండి పారిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఆ గ్రామానికి తిరిగి రాలేదు.
ఆ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కూడా సుధామకి తన తల్లి బాధతో వేసిన కేకలు చెవుల్లో గింగురుమనేవి. తన తండ్రిని నిలువునా.................................