సీమంతం / పువ్వెన
ఒక ప్రాణికి పుట్టకముందు జరిగే మొదటి వేడుక పువ్వెన. కడుపుతో ఉన్న మహిళ, ఆమె గర్భంలో ఉన్న బిడ్డకు మంచి జరగాలి, సంతోషంగా ఉండాలి అని అత్తగారు, కన్న తల్లి, బంధువులు వచ్చి ఆశీర్వదించే మంచి వేడుక. దీనివలన కాబోయే తల్లి మనసులోని ఆందోళనలను తొలగించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు.
ఈ పువ్వెన విశ్వబ్రాహ్మణులందరికీ ఒంతన ఉండదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని కులాలలో పువ్వెన ఆచారం ఉండదు. అలాగే కొన్ని వంశాలలో, కుటుంబాలలో పువ్వెన జరపరాదనే నిబంధన ఉంటుంది. పువ్వెన చేస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్మితే,...........................