Logili Books

Novels

Neevu Thalachinatle

By James Allen , Guru Raja

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Neevu Thalachinatle
Publisher
Red Nib
ISBN
MANIMN6750
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
158
Language
Telugu
Availability
In Stock
About this book

ఆలోచనా మరియు వ్యక్తిత్వం

మనిషి తన ఎలా సంకల్పిస్తాడో, తను అలాగే రూపుదిద్దుకుంటాడు ఈ గొప్ప సూక్తి కేవలం మనిషి ఉనికికే పరిమితం కాదు. అది అతని దైనిందన జీవితంలోని ప్రతి సందర్భానికీ విస్తరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి అక్షరాలా తన ఆలోచనల స్వరూపం. అతని వ్యక్తిత్వం అతని తలంపులన్నిటి పూర్తి సమాహారమే.

విత్తనం లేనిదే మొక్క మొలకెత్తదు కదా! అలాగే, మనిషి చేసే ప్రతి పని వెనుక అతని ఆలోచన అనే నిగూఢ బీజం ఒకటి ఉంటుంది. ఆ బీజం లేనిదే ఏ చర్యా బయటకు వ్యక్తమవదు. ఏ పని జరగదు. ఇది మనం స్పృహ తో తెలిసి చేశాం లేదా తెలియకుండా అప్రయత్నంగా చేశాం అనుకునే పనులకు కూడా వర్తిస్తుంది, కావాలని ప్రణాళికతో చేసే పనులకే కాదు.

మన చర్య ఆలోచనకు పూసిన పువ్వు. ఆనందం, వేదన... అవే దానికి కాసే ఫలాలు. ఈ విధంగా, మనిషి తన స్వంత సంకల్పం నుండి పండిన తీపి, చేదు ఫలాల పంటను తానే స్వీకరిస్తాడు.

మనసులోని భావమే మనలను నిర్మించింది, మనం ఈనాడు ఏమై ఉన్నామో... అది మన సంకల్పం చేతనే రూపుదిద్దుకుంది. ఒకవేళ మనిషి మనసులో దుష్ట సంకల్పాలు ఉంటే, ఎద్దు వెనుక చక్రం తిరిగినట్టు బాధ అతడిని వెన్నంటే వస్తుంది... ... కానీ ఒకడు నిలబడి స్వచ్చమైన భావనలో తపిస్తే, అతని నీడలా ఆనందం అతడిని అనుసరిస్తుంది నిశ్చయంగా...................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?