నరకవాసం
బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరముగా జన్మించాడు. ఈ వానరం పేరు "నందీయుడు". నందీయుడికి ఒక సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో ఎనభైవేల కోతుల మందకు నాయకులుగా ఉంటూ వున్నారు.
నందీయుడికి ఇంటిదగ్గర పోషించవలసిన తల్లి వున్నది. ఆమె పాపం, అంధురాలు.
నందీయుడూ, తమ్ముడూ కలసి రోజూ, వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకువచ్చి, మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. అయితే, ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక, తామే కాజేస్తూ వచ్చారు!
ఒకనాడు నందీయుడు తల్లిని చూడ వచ్చాడు. చూచి, = ఆశ్చర్యపోయి, "అమ్మా! ఏమిటిలా శుష్కించిపోయావు, తిండి లేనట్టుగా? రోజూ మేం పంపే ఫలాలు తినటంలేదా?” అని అడిగాడు.
"లేదు, నాయనా! - ఫలాలూ లేవు, ఏమీ లేవు. తిండి ఉంటే ఎందుకిలా చిక్కిపోతాను?" అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు వెళ్లి, జరిగిందంతా చెప్పి.........................