డాబా హోటల్
అసుర సంధ్యవేళ ఆకాశమంతా చాందినీ పందిళ్ళు వేసినట్లు తెల్లగా మెరిసిపోతుంది. గంటసేపటినుండి సన్న సన్నగా కురుస్తున్న పుల్ల చినుకులను స్వాగతిస్తున్న చేమలన్నీ తమ కొమ్మ రెమ్మలను కదల్చకుండా, ఆకుల నేత్రాలను నేలకు వాన్ని నిశ్శబ్ధంగా అభ్యంగన స్నానం చెయ్యసాగాయి.
చీకటి కొండచిలువ మెలమెల్లగా నోరుతెది ఆ చాందినీ వెలుగులను మిరియ్య సాగింది. దాంతో అంతటా గబ్బగీము అలుముకుపోయి కన్ను పొడుచుకున్నా ఎదురుగా ఏముందో కనిపించకుండా పోయింది.
రాత్రిపూట దానవుడికి బలమెక్కువన్నట్టు అప్పటిదాకా సనసన్నగా కురుస్తున్న వాన కాస్తా భోజనాల వేళకు ఒక్కపెట్టున కుండపోతగా కురవడం మొదలుపెట్టింది. దానితోపాన ఏదో అమానుష, అజ్ఞాతశక్తులు కండ్లు మూతలు పడిపోయేటట్టుగా నింగీ నేలను కలిపేస్తున్న. మెరుపుల కొరడాలను ఝళిపిస్తున్నాయి.
వాటిని అంటిపెట్టుకొని బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉరుముల ఫెళ ఫెళా రావాలు. మొత్తం మీద ఎటుచూసినా గుండెలు జలదరించిపోయే ఫీబత్స భయానక వాతావరణం అలుముకుంది.
ఆ ప్రళయ భీబత్సానికి తారాసింగ్ బాయి తండా మొత్తం బెంబేలెత్తిపోసాగింది. ఆ సమయంలోనే హరిదాస్ భార్య వికీబాయికి పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే అతను ఈతాకుల గూడచాపను కప్పుకొని చుట్టుపక్కల ఇండ్లకెళ్ళి విషయాన్ని వివరించి రమ్మంటూ ఆడవాళ్ళను అభ్యర్ధించాడు. వెంటనే వాళ్ళంతా ఆ భీకర వాతావరణాన్ని గూడా లెక్క చెయ్య కుండా వానలో తడుస్తూనే పరుగెత్తుకెళ్ళారు.
అసలే రక్తహీనతతో బలహీనంగా వున్న పికీబాయి ఓ నులకమంచంలో పడుకుని పురిటి నొప్పుల బాధకు తట్టుకోలేక పాములా మెలికలు తిరిగి పోతూ విలవిల్లాడుతోంది. ఆ స్థితిలోవున్న పికీబాయిని చూస్తూనే "అయ్యో పికీ! అసలే ఒంటూపింది. ఈ సమయంలో నొప్పులు తీస్తోందిగదా ఎట్ల?" వచ్చిన ఆడవాళ్ళు నలుగురూ తమ మనసుల్లో సానుభూతిగా అనుకుంటూ పైకి మాత్రం "పికీ! జర ఓర్చుకో ఓర్చుకో" తమ ప్రయత్నాలు తాము చేస్తూ సముదాయించసాగారు.
ఎంత సముదాయించినప్పటికీ పికీబాయి బాధాపూరిత రోదనలు ఉరుములను మించి వాళ్ళను భయపెట్ట సాగాయి. పికీబాయికి అప్పటికే ఏడాదేడాది తేడాతో ముగ్గురు ఆడపిల్లలున్నారు. అంతకు ముందే ముగ్గురు పిల్లలు పుట్టిపోయారు.
"వంశానికి ఒక్క కొడుకన్న వుండాల" అన్న భర్త కోరికను కాదనలేక తన ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఏటా ఓ పిల్లను కంటూనే వుంది. రాయి వెయ్యగా వెయ్యగా ఓ కాయ రాలి నట్టు పికీబాయికి ఆఖరికో కొడుకు పుట్టాడు. అంతకు ముందు పుట్టిపోయిన పిల్లల..................................