Logili Books

Novels

Dheera (Asamanya Shura)

By Jyothi Valaboju

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dheera (Asamanya Shura)
Publisher
J V Publications
ISBN
MANIMN6836
Binding
Paparback
Published Date
March, 2025
Number Of Pages
640
Language
Telugu
Availability
In Stock
About this book

మేరు నగ ధీర'

నలభై సంవత్సరాల క్రితం ఆర్మూర్ విజయ్ హైస్కూల్ స్థాపించిన కొత్తలో, ఓ రోజు...
"అమ్మాయ్ అమృతా! నాకో చిన్న సాయం చేసిపెట్టాలి" అడిగాడు పెద్దన్నయ్య.
"మీరు అడగడమే గొప్ప, చెప్పండి అన్నయ్యా!" అన్నాను.

"నా బట్టలు ఇస్త్రీ చేసిపెట్టే దోబీ సాయన్న నిన్న నా దగ్గరికి వచ్చాడు. తన భార్య భూదేవి అనుక్షణం తనని ఎవరో నీడలా వెంబడిస్తున్నారంటూ ఏదో ఒక మూల కూర్చుని భయపడుతోందని బాధపడుతున్నాడు" అన్నాడు పెద్దన్నయ్య.

"దానికి నేనేం చేయాలి అన్నయ్యా?" అడిగాను అయోమయంగా.

"సాయన్న భార్య ఆరోగ్యం బాలేదట! 'మీ చెల్లి పెట్టిన విజయ్ పబ్లిక్ స్కూల్ హాస్టల్లో నా భార్య భూదేవికి బట్టలు ఉతికే ఉద్యోగం ఇస్తే ఆమె మనసు పనిమీద పడి కొంచెం ఆరోగ్యం కుదుటబడుతుందేమో చూడండి బాబూ' అంటున్నాడు. ఈ విషయం నీతో చెప్పి ఆమెకి ఉద్యోగం ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు” చెప్పాడు అన్నయ్య.

"పిల్లల బట్టలు ఉతకాలి అంటే, ఆమె మానసిక పరిస్థితి ఎలా వుందో చూసి ఉద్యోగం ఇవ్వాలి కదా అన్నయ్యా!" అన్నాను.

మర్నాడు సాయన్న తన భార్యని తీసుకుని హాస్టల్కి వచ్చాడు. భార్యని పరిచయం చేసాడు. చాలా సన్నగా, పీలగా వున్న ఆమె నలభైమంది పిల్లల బట్టలు అసలు ఉతకగలదా అన్పించింది.

"చూడమ్మా! పిల్లల స్నానాలు ఉదయం ఆరుగంటలకల్లా అయిపోతాయి కాబట్టి నువ్వు పొద్దున్న......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?