Logili Books

Novels

Premalu

By Thatavarthi Nageshwari

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Premalu
Publisher
Anvikshini Publishars
ISBN
MANIMN6746
Binding
Papar back
Published Date
2025
Number Of Pages
215
Language
Telugu
Availability
In Stock
About this book

"అంటీ! మీరు అర్జెంట్గా రండి!" ఫోన్లో కావేరి గొంతు వణికిపోతోంది. "ఏమైందమ్మా?" ఆందోళనగా అడిగింది జానకి.

అవతలి వైపు నిశబ్దం. కావేరి చెప్పడానికి తటపటాయిస్తోందని అర్థమైంది. "చెప్పమ్మా! ఏమైంది?" జానకి గొంతులో ఒత్తిడి పెరిగింది.

"అమ్మ... అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది. ” కావేరి ఏడుపు అడ్డుపడుతుండగా అతికష్టం మీద చెప్పింది.

"వాట్?" జానకి గుండె జారిపోయినట్టయింది.

"మీరు ఒకసారి రండి ఆంటీ. ప్లీజ్!"

“ఇప్పుడే బయల్దేరుతున్నా.” ఫోన్ పెట్టేసింది జానకి.

ఆఫీస్ కి వెళ్ళే హడావుడిలో ఉన్న రామచంద్ర, భార్య ముఖకవళికలు చూసి ఆగిపోయాడు. "ఏమైంది జానూ?”

విషయం చెప్పాలా వద్దా అని ఒక క్షణం సందిగ్ధంలో పడిపోయింది. కానీ దాచడం అనవసరం అనిపించింది. "వైదేహికి ఏదో ఒంట్లో బాగాలేదట. కావేరి ఫోన్ చేసింది.”

"అయ్యో అవునా? వెళ్ళు వెళ్ళు." రామచంద్ర వెంటనే అన్నాడు.

"మీకు క్యారేజీ..."

"నేను సర్దుకుంటాలే. నువ్వు వెళ్ళు." అతను తొందరచేశాడు.

వైదేహితో జానకికి ఉన్న అనుబంధం రామచంద్రకి కొత్త కాదు. జానకి మారు మాట్లాడకుండా, జుట్టు ముడి కూడా సరిగ్గా వేసుకోకుండానే హడావుడిగా బయల్దేరింది.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?