జోతలు
ఉ. తిక్కవరాన్వవాయము ప్రదీప్తముగా నుదయించి, రెడ్డిభూ
భుక్కుల దానశీలతకు ముత్తెపుమేడలుగట్టి సింహపుం
బక్కణ సుప్రతిష్ఠలకు వన్నెలుదీర్చిన పుణ్యమూర్తికిన్
మ్రొక్కులొసంగెదన్ శుభసముత్కటవారికి, రామిరెడ్డికిన్
అర్ధాలు: అన్వయము = వంశం, ప్రదీప్తము = బాగా ప్రకాశించడం, భూభుక్కు = రాజు,
పక్క పట్టణ, వన్నెలు = అందాలు, వార్ధి = సముద్రం.
తాత్పర్యం: తిక్కవరపు వంశాన్ని మిక్కిలి ప్రకాశింపజేస్తూ, రెడ్డిరాజుల దానగుణ స్వభావానికి ముత్యాల మేడలు కట్టి, నెల్లూరు పట్టణ వైభవానికి, ప్రతిష్ఠకు కొత్త అందాల్ని సమకూర్చిన పుణ్యమూర్తి, మంచి గుణాలకు, శుభకార్యాలకు నిలయమైన రామిరెడ్డి గారికి నమస్సుల్ని అందజేస్తున్నాను.
శా: నూరున్నారు మూడుమారులిడి, నన్నున్దాన్పి, నావాంఛలన్
గారుణ్యంబునఁ దీర్పనెంచిన సుధాకల్ప ప్రజల్పుండు, ల ల
క్ష్మీరమ్యుండు, పరేంగితజ్ఞుఁడగు శ్రీ.శ్రీ. రామిరెడ్డిప్రభున్
నూరున్నారు సువర్ణగీతుల నుతింతు సాహితీసీమలన్=
అర్ధాలు: నూరున్నారులు = నూటా పదహారు రూపాయలు, వాంఛ = కోరిక, సుధాకల్ప ప్రజల్పుండు = అమృతతుల్యుడు, లక్ష్మీ రమ్యుండు = ధనవంతుడు, పరేంగితజ్ఞుడు = ఎదుటివారి మనసును తెలుసుకోగలిగినవాడు, నుతింతు = కీర్తింతు.
తాత్పర్యం: నూటపదహార్లు మూడుసార్లు నాకు ఇచ్చి నన్ను సంతృప్తి పరిచి, నా పై దయతోన అవసరాల్ని, కోరికలన్ని తీర్చిన అమృత తుల్యమైన కల్పవృక్షం, లక్ష్మీదేవి............