గాలి నీరు నిప్పు ప్రేమ
నిన్నెలా గుర్తు పెట్టుకోవాలి...
ఏమో!?
పువ్వు రాలినా
గాలిగోడలకంటి
వదలని సుగంధంలా...!!
రెండు మబ్బులు ఉరుముల శబ్దాలతో
ముద్దు పెట్టుకుంటున్నప్పుడు
తళుక్కున మెరిసే మెరుపులా...!!
కొండ చిలువలా
ప్రేమతో చుట్టేసినప్పుడు
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన
ప్రేమికుడిలా...!!.......................