• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Navameghana

Navameghana By Kanakala Ravi Kumar

₹ 150

విప్లవాగ్ని

 

అక్షరాల సంపత్తిని
విత్తులుగా భావించి
విప్లవాగ్ని వినిపిస్తున్నా...
ఉద్యమాన్ని నడిపిస్తున్నా..!

పీడిత, కార్మిక, కర్షక
బ్రతుకులలో వెలుగుకోరి
కలంపట్టి ప్రశ్నిస్తున్నా
మంచికోరి నినదిస్తున్నా..!

రావణ మూకలు చేరి
భూమాతను కొల్లగొట్టి
బొక్కిబొక్కి తింటుంటే
ఆ రాబందులనెదిరిస్తున్నా..
విప్లవాగ్ని వినిపిస్తున్నా..;

మొత్తం ప్రకృతినంతా
పణముచేసి పాలిస్తూ,
రేపటి చీకటి కోసం
ప్రణాళికలు చేస్తున్న..
ఆలోచనలేని వారి
ఆత్రాన్నే ఎదిరిస్తున్నా
విప్లవాగ్ని వినిపిస్తున్నా..!

  • Title :Navameghana
  • Author :Kanakala Ravi Kumar
  • Publisher :Anvikshini Publishars
  • ISBN :MANIMN4198
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock