నిరంతర యాత్రికుడు
ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు అలా దొర్లిపోయాయి...! వెనక్కి తిరిగి ఓ మారు చూసుకుంటే, ఒక్కో ఏడాది ఒక్కో మెట్టులా అనిపిస్తోంది.
అవన్నీ ఎవరో చాలా జాగ్రత్తగా పేర్చినట్లుగా, ఒకదానికి మరోదానికి ఏదో సంబంధం ఉన్నట్లుగా...!
కల నెరవేరకపోవడం కూడా కొన్నిసార్లు వరం లాంటిదే..!
అంతకంటే గొప్ప సంఘటనలు నీ జీవితం లోకి ఊహించనిరీతిలో ప్రవేశించినపుడు కల నెరవేరకపోవడం కూడా కొన్నిసార్లు వరం లాంటిదే.
రమారమి ముప్ఫై ఏళ్ళ క్రితం మాట, చాలామందిలాగే నాకూ అప్పుడు ఓ కల ఉండేది. ముందు దాని గురించి చెబుతాను. ఆ తర్వాత మిగతా విషయాలు. లైబ్రరీకి వెళ్ళినప్పుడల్లా ఎంప్లాయ్మెంట్ న్యూస్, కాంప్టేటివ్ సక్సెస్ రివ్యూ ఇంకా ఇలాంటి పత్రికలు చదువుతుండేవాణ్ణి. విజయం సాధించిన సివిల్ సర్విస్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూలు చదివినప్పుడు, ఎందుకోగాని అది నేను కూడా సాధించగలను అనిపించేది. మరి అది నా అజ్ఞానమా లేదా ఇంకొకటా..?! చెప్పలేను.
అప్పటికి గ్రాడ్యుయేట్ని. ఎందుకైనా మంచిదని బి. యిడి కూడా చేశాను. నిజానికి మద్రాస్ యూనివర్శిటిలో ప్రవేశించి ఎమ్మే ఆంగ్ల సాహిత్యం చేయాలనేది నా కోరిక. కాని ఇంట్లో ఆర్థికపరిస్థితులు అంతంత మాత్రం. అలాఅని మరీ ఎవరినీ యాచించే స్థితి కాదు. అదే మధ్యతరగతి మందహాసం అంటే...........................