పిల్లలు మైదానాలలో వుండే నేలబారు కథలను అంతగా ఇష్టపడరు. వాళ్ళకు ఎత్తుగా పర్వతాలలా ఉండే అద్భుతాలు, లోతైన లోయల్లా ఉండే విచిత్రాలు ఉన్న కథలు చదవడమంటే ఇష్టం. మాట్లాడే గడ్డిబొమ్మ, తగరపు మనిషి, సింహం, వీళ్ళ ముగ్గురిని కూర్చుకొని వింత వింత దేశాలలో విచిత్రాలను చూస్తూ, సాహసాలను చేస్తూ మనందరి మనసుల్ని దోచి, దాచుకొనే డరోతీ పిలుస్తోంది.
రండి పుస్తకం తెరవండి.... చదువుతూ మిమ్మల్ని మీరు మరువండి.