Logili Books

Short Stories

Pakistan Velle Railu

By Kushwanth Singh , Akundi Narayana Murthy

₹275
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pakistan Velle Railu
Publisher
Red Nib
ISBN
MANIMN6772
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
193
Language
Telugu
Availability
In Stock
About this book

1947వ సంవత్సరం.. నడివేసవి.

గడచిన ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రీష్మం భారత్ లోనిప్పులు చెరుగుతోంది. భరించలేని ఉక్కపోతకు ఉడుకెత్తిపోతున్న జనం ఒక్కసారైనా పెద్దగా వాన కురిస్తే బావుణ్ణు అని ఆశ పడుతున్నారు..

ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఇలా మబ్బులు మోసం చేయలేదు. ఈసారిలా మేఘాలు మొహం చాటేస్తున్నాయి

ఇది పాపాత్ములకు దేవుడు విధిస్తున్న శిక్ష అని కొందరు ఆస్తికులు తలపోస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి తాము శిక్షలకు పాత్రులం అని కొందరు సమాధానపడుతున్నారు..

స్వాతంత్య్ర పోరాటం తుది దశకు చేరిన తరుణంలో మొదలవడానికి కొద్ది రోజుల ముందరే - భారత దేశ చరిత్ర గతిని సమూలంగా మార్చేసేంత ప్రాముఖ్యత కలిగిన ప్రకటన వెలువడింది.

దేశం రెండు భాగాలుగా అంటే- హిందువులకు చెందిన ఇండియాగానూ, ముస్లిమ్స్క చెందిన పాకిస్తాన్ గానూ విడగొట్టబడుతోందీ అని.

ఈ ప్రకటనతో - అగ్నికి ఆజ్యం మాదిరిగా మత ద్వేషాలకు వేర్పాటువాదం తోడయ్యింది. కలకత్తాలో మత కలహాలు పెచ్చరిల్లాయి. కొద్ది నెలల వ్యవధిలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక పథకం ప్రకారం ముస్లింలను చంపడం హిందువులు మొదలెట్టారని వాళ్ళు ఆరోపణ చెయ్యగా కాదు కాదు. ఈ దమనకాండను ముస్లిములు మొదలెట్టి హిందువుల ప్రాణాలను హరిస్తున్నారని వీళ్ళు ప్రత్యారోపణ చేస్తున్నారు. వ

నిజానికి రెండు పక్కలా హననం జరుగుతోంది. రక్తపుటేరులు పారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ఇళ్ల దహనాలు.. యథేచ్ఛగా ఘోరకలి సాగుతోంది.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?