Logili Books

Short Stories

Pandibazar Kathalu

By Bhuvanachandra

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pandibazar Kathalu
Publisher
AA
ISBN
MANIMN6632
Binding
Papar Back
Published Date
Aug, 2025
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

పాండీబజార్ కథలు - నేపథ్యం

నేటితరం సంగతి వేరు కానీ, నాడు... సినీజీవులు పుట్టి పెరిగింది. మాత్రం మద్రాస్ అనే నేటి చెన్నై 'పాండీబజార్'లోనే, ఎందరో సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులూ, రచయితలు, గీత రచయితలు, నృత్య, సంగీత, కళా దర్శకులు, దిగ్దర్శకులూ, అందరూ ఆ పాండీబజార్లో నడయాడినవారే. ఆ చల్లని చెట్ల క్రింద సేదదీరినవారే. మొట్టమొదట దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని కలిసిందీ, షావుకారు జానకిగారినీ, మైలవరపు గోపీగారినీ కలిసింది అక్కడే. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న రోజుల్లోనే 'మాంబళం' స్టేషన్లో దిగి, 'భట్స్' హోటల్లో టిఫిన్ చేసి, మాంబళం, కోడంబాకం ఏరియాలో తెగ తిరిగేవాణ్ణి. ఎందుకంటే, నాకే తెలీదు అప్పుడు. కానీ, ఏ ఏరియాలో తిరిగానో, అక్కడే అద్దె గదుల్లో ఉండటమూ, రచయితగా ఎదగటమూ కూడా జరగడం దేవుడిచ్చిన వరం కాక మరేమిటీ? ఆరుద్రగారి ఇంటి వెనుకనున్న 'మలర్కొడి మేన్షన్'- నా మొదటి నివాసం. జయ లలిత(CM) తల్లిగారు నివసించిన H.No.10. శివజ్ఞానం స్ట్రీట్ ఇంటిపక్క ఇల్లే నా రెండో నివాసం.

అసలీ పాండీబజారుకీ, సినిమాకీ ఉన్నదో అవినాభావ సంబంధం. ఆ రోడ్ల మీదే... కోటానుకోట్ల కలలూ, కన్నీళ్ళు కూడా దర్శనమిస్తాయి. ఒక పక్కన వస్త్ర వ్యాపారం, మరోపక్క ఆసియాలో పెద్ద ఎత్తున జరిగే నగల వ్యాపారం, ఇంకో పక్క 'కలల వ్యాపారం' ఇలా త్రివేణి సంగమంలా... ఇదో వ్యాపారసంగమం. గాయకులూ, గాయనీమణులూ కూడా ఇక్కడ ప్రభవించినవారే.

పానగల్ పార్కు బెంచీలకి పింగళిగారూ, మల్లాది రామకృష్ణశాస్త్రి గారూ, ఘంటసాలగారూ, జరుక్ శాస్త్రిగారూ అందరూ గుర్తే. అక్కడి చెట్లకి ఇంకా ఆ మహానుభావుల స్వరాలు జ్ఞాపకమే. అదిగో ఆ గీతా కేపూ, వుర్లాండ్స్ హోటలూ, నల్లీ సిల్మ్స్, ఊమ్మిడియార్స్, బాలాజీభవన్, భగవతీవిలాస్ అన్నింటికీ గుర్తే. ఎవరికేమి కావాలో, ఎవరి పసందు ఏమిటో!

డబ్బున్నవాళ్ళు స్టైలుగా వుర్లాండ్స్.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?