Logili Books

Personality Development

Prajatantra Viplavamlo Social Democracy Rendu Ettugadalu V I Lenin

By Rachamallu Ramachadra Reddy

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prajatantra Viplavamlo Social Democracy Rendu Ettugadalu V I Lenin
Publisher
Praja Shakthi Book House
ISBN
MANIMN6266
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
151
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రజాతంత్ర విప్లవంలో సోషల్ డెమాక్రోసీ రెండు ఎత్తుగడలు'

సమాజంలో దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. అందుకోసం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడం, ఆ వ్యవస్థను పరిరక్షించే రాజ్యాంగయంత్రం స్థానంలో నూతన రాజ్యాంగయంత్రాన్ని నెలకొల్పడం అవసరం. సమాజ పరిణామక్రమంలో పెట్టుబడిదారీ వర్గం ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థ అవశేషాలన్నింటినీ నిర్మూలించి ఆ స్థానంలో తన వద్ద దోపిడీకి అనుకూలంగా ఉండే నూతన, పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తుంది. ఈ తిరుగుబాటునే బూర్జువా ప్రజాతంత్ర విప్లవం అంటారు. దాని అనంతరం ఏర్పడే నూతన పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారీ వర్గం తనను అంతమొందించే శత్రువును తానే పెంపొందిస్తుంది. ఆధునిక కార్మికవర్గమే బూర్జువా వర్గానికి శత్రువు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతకంతకూ పెట్టుబడి కేంద్రీకరించబడుతూ వుంటుంది. దానితోబాటు కార్మికవర్గమూ కేంద్రీకరించబడుతూ వుంటుంది. ఉత్పత్తిని నిరంతరం పెంచుకుంటూ పోగలిగినంతకాలమూ పెట్టుబడిదారీ సమాజం కొనసాగడానికి ఆటంకం ఉండదు. ఐతే ఉత్పత్తితో బాటు శ్రమ దోపిడీని కూడా పెంచుకుంటూ పోవడం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. దీని ఫలితంగా ఆ సమాజంలో పెట్టుబడిదారీ వర్గం తనను తానుగా ఒక పరిష్కారం లేని ఊబిలోకి దిగబడుతుంది. తనతోబాటు మొత్తం సమాజాన్ని కూడా ఆ ఊబిలోకి దింపుతుంది. అదే సార్వత్రిక సంక్షోభం. దీనికి పరిష్కారం చూపగలిగినది సంఘటిత కార్మికవర్గం మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థను నాశనం చేయడమే ఆ పరిష్కారం. విప్లవం ద్వారా కార్మికవర్గం దోపిడీ వ్యవస్థను కూలదోసి ఆ స్థానంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తుంది. - కమ్యూనిస్టు ప్రణాళికలో మార్చ్, ఎంగెల్స్ చెప్పినది ఇదే..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?