Logili Books

Telugu

Prasiddha Balageyalu

By Dr K Prabhakara Reddy

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prasiddha Balageyalu
Publisher
Amaravathi Publications
ISBN
MANIMN3087
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
92
Language
Telugu
Availability
In Stock
About this book

                                తల్లి గుండెలోని పట్టరాని తీపినంతా రాగమయం చేసిన మధుర నాదాలు-జోలలై, గుండె ఊసులై, రసధారలై-ఎన్నెన్ని జోలలు! ఎన్నెన్ని లాలింపు పాటలు! ప్రకృతిలోని పంచభూతాలలోని శృతిలయలన్నీ మేళవింపుగా అక్షరాలు కూర్చుకొన్న పాలపాటలు! -

                                  ఊయేల పాటలేనా? ఊహ తెలిసిన పిల్లలకు, ఆటా, మాటా నేర్చిన 
పిల్లలకు మరెన్నో పాటల ఊటలు కావాలి. ఆట ఆటకూ ఒక పాట-సరసాలకూ, సరదాలకూ పాట-వెక్కిరింపులకూ వేళాకోళాలకూ పాట - పండుగ పండుగకూ ఒక్కొక పాట -

                                ఇట్లా-బిడ్డలపట్ల తీరని తమకంతో తల్లులు పాడుకొనేవి కొన్ని, తల్లుల ఒడి వీడి ఆటలు మరిగిన పిల్లలు చిందుకూ గెంతుకూ తందాన పాటగా పాడుకొనేవి కొన్ని -

                                 ఏనాటివి ఈ పాటలన్నీ! ఎవరు కట్టి ఉంటారు ఈ బాణీలన్నీ! వారి ఊరూ పేరూ తెలియదు కాని, ఆదికాలం నుంచీ బిడ్డలను కని పెంచిన తల్లుల ఉల్లాల నుండి, తండ్రుల చిత్తాలనుంచి జాలువారిన అచ్చపు పూదేనె వాకలు - ఈ

పిల్లల పాటలు -

                                  ఈ బాలగేయాలను ఈ రూపంలో మనకు అందిస్తున్న సాహితీమూర్తి డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి భావ ప్రపూర్ణమైన, పరిశోధనాత్మకమైన, రసవత్తరమైన రచనలతో తెలుగు సాహితిని పరిపుష్టం చేసినవాడు. ప్రౌఢసుందరమైన కవిత్వం ఒకచేత - పరిశోధనా ప్రవృత్తి మరొకచేత - సవ్యసాచిగా సాహిత్య సృజనకు పూనుకొన్నవాడు; ఇప్పటికే గద్య, పద్య, గేయ, నాటికాప్రక్రియలలో-స్వీయ రచనలు, మహాకవులైన వారి సాహిత్య వ్యక్తిత్వ విశ్లేషణలతో కూడిన గ్రంథాలు - ఎన్నో వెలువరించి సాహిత్య లోకంలో సుస్థిర పీఠం వేసుకు కూర్చున్న వాడు! ఇప్పుడీ బాలగేయ సంకలన కర్తగా, బాలగేయ వ్యాఖ్యాతగా మరోమారు మనముందుకు వస్తున్నవాడు - శిశువైద్య ప్రముఖుడు డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి

                                                                                                                                          - సి. వేదవతి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?