• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rajyam Matham Kortulu Hakkulu

Rajyam Matham Kortulu Hakkulu By Alapati Suresh Kumar

₹ 200

నేరాన్ని చట్టబద్ధం చేసిన తీర్పు!

దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన రామజన్మభూమి - బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పుపై మహాత్ముడి మునిమనుమడు తుషార్ గాంధీ ఎలా స్పందించారో తెలుసా? "మహాత్ముడి హత్యకు నాధూరాం గాడ్సేను సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తే, గాడ్సే హంతకుడే, అయితే దేశభక్తుడు కూడా అంటూ తీర్పు చెబుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

అయోధ్యలో బాబరీ మసీదును 1992లో నేలమట్టం చేసిన ఘటనను సుప్రీంకోర్టు ధర్మాసనం తన 1045 పేజీల తీర్పులో ప్రస్తావించింది. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 'చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్న సెక్యులర్ దేశంలో చేపట్టకూడని పద్ధతుల్లో ముస్లింలకు లేకుండా చేసిన మసీదు గురించి పట్టించుకోకపోతే న్యాయం జరిగినట్లు కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

అదే సుప్రీంకోర్టు ధర్మాసనం వివాదస్థలం మొత్తాన్నీ 'రామలల్లా విరాజ్మాన్'కు అప్పగించింది. ఒక పక్క నేరం జరిగిందంటూనే మరోపక్క దాని వల్ల తమ హక్కులు కోల్పోయిన వారికి ఆ హక్కులు నిరాకరించడం ఈ తీర్పు ప్రత్యేకత. అందుకే తుషార్ - గాంధీ అలా స్పందించారు.

8 16 శతాబ్దంలో అయోధ్యలో నిర్మించిన బాబరీ మసీదు అక్కడ నిలిచి 1. ఉన్నంతవరకూ ముస్లింలకు దానిపై హక్కులు ఉన్నాయి. బాబరీ మసీదును ఈ కూల్చివేసిన తర్వాత కూడా వారికి ఆ హక్కులు కొనసాగాయి. చివరికి సుప్రీంకోర్టు ఆ ఈ తీర్పుతో వారికి ఆ హక్కులు లేకుండా చేసింది. అందుకోసం ధర్మాసనం అటు ఆ వాస్తవాలపై కానీ, ఇటు కాలపరీక్షకు నిలబడిన న్యాయసూత్రాలపై కానీ 9: ఆధారపడలేదు. ఎవరి మతపరమైన నమ్మికలు వారికి ఉంటాయని అంటూనే gt మెజారిటీవాదం నమ్మికపై ఆధారపడింది. నమ్మిక ఆధారంగా తీర్పు చెప్పలేమని 200 అంటూనే రామజన్మభూమి అనే నమ్మికకు చట్టబద్ధత కల్పించింది. చిత్రం ఏమంటే మసీదు నిర్మాణానికి మందిరాన్ని కూల్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఈ తీర్పులోనే ధర్మాసనం స్పష్టం చేసింది....................

  • Title :Rajyam Matham Kortulu Hakkulu
  • Author :Alapati Suresh Kumar
  • Publisher :Samvedana Publications
  • ISBN :MANIMN4076
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock