Logili Books

General

Ramam Baje Syamalam

By Kovela Santhosh Kumar

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ramam Baje Syamalam
Publisher
Sahithi prachuranalu
ISBN
MANIMN3590
Binding
paperback
Published Date
July, 2022
Number Of Pages
402
Language
Telugu
Availability
In Stock
About this book

మీ చరణం నాకు శరణం

యుగాల ముందు భారతదేశంలో పరావాక్కు రామ కథారూపంలో దిగివచ్చింది. ఈ వాక్కును వెలువరించిన సందర్భంలో పుట్ట తేనియ మానవ జీవితంలో కలిగే మధుర మధుర అనుభవాలకంటే ఉదాత్తమైన ఉన్మనీ స్థానంలోని దీప్తికన్న, చిన్మయమైన జానకీరామచంద్రుల కథ.. పలుకుల జడియై దిగి వచ్చింది. ఆ రామాయణంలోని గంగావతరణ సందర్భం విశ్వ చైతన్యం ఒక ప్రధాన ఘట్టం. మనిషి ఉత్తంగా ఎదగడాని కి జీవచైతన్యంలోకి విశ్వ చైతన్యం అవతరించడానికి అది దివ్య చైతన్యంగా పరిణమించడానికి కారణమైన వాగ్గేవతావిష్కారం.

ఈ రామకథా చైతన్యం మాకుటుంబంలో మా ప్రపితామహులు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్యస్వామివారి వల్ల ఒక అర్ధశతాబ్దం పై పాటు ప్రవచన రూపంలో ఎంతోమంది జీవులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆ చైతన్య గంగ మూడు తరాలైనా మమ్మల్ని ఆవరించే ఉన్నది. మాలో ప్రతి ఒక్కరిలోకి ఈ పరంపర మధుర వాకు సారంలో ప్రవేశించింది. మా ప్రపితామహుల సంతానం నలుగురు ఈ తీరమును లోకానికి అందజేసినవారే. మా నాన్నగారు పదేండ్ల నాటికే ఈ స్రవంతిలో అవగాహన చేసి తమను తాము పవిత్రీకరించుకొన్నారు. ఆ మార్గంలో నడిచివచ్చిన నాకు వాల్మికి వాగ్గేవతను ఇలా అర్చించే అవకాశం లభించింది. నేను రామం భజే శ్యామలం అనే | వ్యాస పరంపర రూపంలో సాధ్యమైనంతలో దాని సమర్చన చేసుకొన్నాను. ఈ రచనను సప్రక్రయంగా, సాధు భావనతో, ధన్య భావనతో ఈ వంశ మణిదీపమైన మా ప్రపితామహులు

కోయిల్ కందాడై రంగాచార్య స్వామి వారి చరణ సన్నిధిలో...

వారి పరంపరను ముందుకు తీసుకొని వెళ్లి అందించిన మా పితామహులు వెంకటనరసింహాచార్యులు.. వారి సోదరులు లక్ష్మి నరసింహాచార్యులు, అప్పలాచార్యులు, సంపత్కుమారాచార్య పాదపద్మాలకు.. |

ఈ పరంపరను నాదాకా అందించి.. నన్ను నాటికీ, నేటికీ, ఏనాటికీ నడిపిస్తున్న మా నాన్నగారు.. నా కండ్లముందు నడిచే సరసంతి || ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య కర చరణములకు.. | నా జీవితానికి సార్థకత చేకూర్చి.. ఆత్మాశ్రయంగా ముందుకు నడిపిసున ను

సంరీయ శ్రీనివాసు.. ఈ నా ఉనికికి ఊపిరినిచ్చిన అమ్మ శారదకుడు కృతిని సమర్పించుకొంటున్నాను.

- కోవెల సంతోష్ కుమార్....

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?