• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Reverse Reservation La kosam Kapula Karchicchu

Reverse Reservation La kosam Kapula Karchicchu By U S

₹ 300

               కాపులు ఎక్కడా సామాజిక వివక్షకు గురికాలేదు. సమాజంలో ఇతర అగ్రవర్ణాల మన కాపులకు కూడా సమాన గౌరవం లభించింది. ఇప్పటికీ లభిస్తున్నది. అందువల్ల వారికి కావలసింది, ఆర్థిక చేయూతే కానీ, రిజర్వేషన్లు కాదు. తునిలో జరపతలపెట్టిన కాపు సామాజిక వర్గ సదస్సు నిర్వాహకులు కాపులందరికీ దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సిన సమయమిది. సదస్సుకు తరలివచ్చే కాపు యువతకు లక్ష్యం బోధించి, రాజకీయ గుర్తింపు సాధించే దిశగా, సమాజంలోని వివిధ వర్గాలను కలుపుకు వెళ్లే బాధ్యతను అప్పగించాల్సిన అవసరం ఉంది.

                   తమకు ఏమి... ఎందుకు కావాలనే విషయంలో ఒక స్పష్టత లేకపోవడం, సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో పలితాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నామనే భావన కలిగి ఉండడం- ఇటు కాపు సామాజిక వర్గాన్ని, అటు సభ్య సమాజాన్ని కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నట్టు కనపడుతున్నది. కాపు వర్గీయులు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమై లేరు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో, దేశ విదేశాల్లోను పెద్దసంఖ్యలో ఉన్నారు. కానీ.. అలజడి అంతా విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు ఎక్కువగా పరిమితమై ఉన్నట్టు కనబడుతున్నది. అటు విశాఖపట్నానికి, ఇటు పశ్చిమగోదావరికి మధ్యలో కేంద్రీకృతమై' ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి - ఉద్యమించడానికి సిద్ధమైన రాజకీయ ఆవేశపరుడు ముద్రగడ పద్మనాభం ఇందుకు కారణమైతే కావచ్చు.

  • Title :Reverse Reservation La kosam Kapula Karchicchu
  • Author :U S
  • Publisher :Eduritha Publications
  • ISBN :MANIMN2509
  • Binding :Paerback
  • Published Date :2016
  • Number Of Pages :368
  • Language :Telugu
  • Availability :instock