|
ఆర్జీవీ - వ్యక్తిత్వం & ప్రేరణ తనదైన ఆలోచనా ధోరణి రామ్ గోపాల్ వర్మను సాధారణమైన వ్యక్తిగా చూడటం పొరపాటు. అతను ప్రత్యేకమైన వ్యక్తి కాదు, కానీ ప్రత్యేకంగా ఆలోచించగలిగిన వ్యక్తి. ఆర్జీవీ ఆలోచనా విధానం ఒక తుపాకీ లాంటిది. * అది ఎప్పుడూ సూటిగా ఉంటుంది. * అది ఎవర్నైనా తప్పకుండా తాకుతుంది. * అది ఏపాటికి భయపడదు. తనకు నచ్చిన విషయం ఎవరైనా తప్పుగా భావించినా, తన స్టాండ్ మార్చుకోడు. తన సినిమాల్లోనూ, జీవితం గురించి చెప్పే మాటల్లోనూ బ్యాలెన్స్ చేసే ప్రయత్నమే ఉండదు. ఎందుకంటే, అతని దృష్టిలో నిజం చెప్పడం, అందరికి నచ్చేలా చెప్పడానికి మార్పులు చేయడం కాదు. ఆర్జీవీ ఎప్పుడూ “నేను అనుకున్నది, నాకొచ్చిన విధంగా చెబుతాను” అనే సిద్ధాంతాన్ని పాటిస్తాడు. మహేష్ ఉప్పాడ • 19 * ఆర్జీవీ వైరస్ |