• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sahitya Vyasalu Mundu Maatalu Grandha Sameekshalu

Sahitya Vyasalu Mundu Maatalu Grandha Sameekshalu By Madhuranthakam Rajaram

₹ 500

బడిలో అలజడి

ఒకానొక కాలంనాడు యుద్ధాని కెళ్లడం ఘనమైన విషయం. అలా వెళ్లేవాడిని వీరుడనీ ధీరుడనీ కొనియాడేవారు. వెళ్లినవాడు చల్లగా తిరిగి రావాలని దండాలు పెట్టుకొనేవారు ఆప్తులు. ఈనాడు ఆ ఘనత కొంత ఉపాధ్యాయులకు అబ్బినట్టు కనబడుతోంది.

పరీక్షలలో వాచర్, సూపరింటెండెంట్గా వెళ్లడం ఇంచుమించు యుద్ధ రంగానికి వెళ్లడం లాగే ఉంది. అలా వెళ్లిన టీచరు దెబ్బలు తినడం బాగా రివాజై పోతోంది. మొన్న స్కూలు ఫైనలు పరీక్షలకు మదనపల్లిలో 400 మంది విద్యార్థులు పరీక్షాకేంద్రం మీదకు దండయాత్ర చేశారు. ఇలాంటి వార్తలు ఏటేటా మార్చి, ఏప్రిల్ నెలలలో మామూలు అయిపోయాయి. ఎప్పటికప్పుడు లాంఛనానికో మాటు హౌరా అన్నన్నా అనుకోవడం కూడా రివాజై పోయింది. జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కట్టుదిట్టమైన కట్టుదిట్టాలు ఏర్పాటు కావడం లేదు. దానాదీనా, బడులలో పిల్లలకు కూడా చదువంటే అలుసు, మాస్టరంటే లోకువా, మహా అయితే జాలీ కలుగుతాయి తప్ప భయభక్తులు, గౌరవం లేవు. ఈ వ్యాసంలో ఉపాధ్యాయుడి దృష్టి లోంచి నేటి స్థితిగతులను చర్చించడం జరిగింది.

త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడికి గుడి లేనట్టే ముగురమ్మల్లో సరస్వతికి గూడా ప్రత్యేకంగా ఆలయం వున్నట్టు కనిపించదు. అందుకావిడ చింతించినట్టు గూడా తోచదు. ఎందుకంటే వేదాది విద్యలు ఆమెకు విహరణ స్థలాలాయె, మొదట ఆమెను తలచుకొని గానీ పుస్తకం చేబట్టని పాఠకుడు లేడాయె. పైగా ఆ రోజుల్లో సాధారణంగా బడి గుడిలోనే జరిగేదని చెబుతారు. పండితుడు, ఆదర్శప్రాయుడూ అయిన గురువు, జిజ్ఞాసువులైన శిష్యులు, పవిత్రమైన ఆవరణ, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ శారదాదేవి కాపురం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా సాగిపోతుండేది.....................

  • Title :Sahitya Vyasalu Mundu Maatalu Grandha Sameekshalu
  • Author :Madhuranthakam Rajaram
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6856
  • Binding :Papar back
  • Published Date :Dec, 2025
  • Number Of Pages :656
  • Language :Telugu
  • Availability :instock