Logili Books

Novels

Navalalu, Geyalu, Geyanatikalu, Natikalu, Kathalu

By Madhuranthakam Rajaram

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Navalalu, Geyalu, Geyanatikalu, Natikalu, Kathalu
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6857
Binding
Papar back
Published Date
Dec,2025
Number Of Pages
656
Language
Telugu
Availability
In Stock
About this book

చిన్న ప్రపంచం సిరివాడ

దేశవాళీ పద్ధతిలో చెప్పాలంటే రాత్రి మూడో జాము పూర్తి కావడానికింకా ఒకటి రెండు ఘడియల వ్యవధి వుంది. ఇంగ్లీషువాడి కాలమానం ప్రకారం గంట రెండున్నర కావస్తోంది.

సిరివాడ సినిమా థియేటర్లో రెండో ఆట సాధారణంగా ఒకటిన్నరకే పూర్తవుతుంది. అంత కొక అయిదు నిమిషాలు ముందుగానే ప్రేక్షకులు రోడ్డుపైన వుంటారు. సత్యాన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే జాతీయగీతాలాపన చెవిలో పడటానికి వీల్లేనంతదూరంలో వుంటారు. అర్ధరాత్రి తరువాత జాతీయగీతాలాపన చట్టబద్ధమౌనా కాదా! కాని పక్షంలో ఆ విషయం సిరివాడ సినిమా థియేటర్ల వారికి తెలియదా? నిజానికి వాళ్ళు రాత్రి రెండో ఆట ముగిసిన తర్వాత జాతీయగీతాన్ని వినిపిస్తున్నారా? లేక వినిపిస్తారేమో నన్న అనుమానంతో ప్రేక్షకులు అలవాటు ప్రకారం అలా రోడ్డు పైకి పారిపోయి వచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సదుత్తరాలు యిస్తే గిస్తే బేతాళుణ్ణి వీపుపైన మోసి తెస్తున్న విక్రమార్కుడే యివ్వాలి. మౌనభంగం జరిగిందా, బేతాళుడు చెట్టెక్కేస్తాడు. తెలిసీ చెప్పకపోయెనా, విక్రమార్కుడే తల పగిలి చస్తాడు. రెండంచాలా మనకు నష్టంలేదు.

లోకానికంతా రాత్రి ఒకటే ననుకుంటారు. సభలో, సత్సంగాల్లో దేవుడు ఒకడేనని చెప్పుకుంటారు. అలాంటిదే ఇదిన్నీ! కాకపోతే నగరాల్లో రాత్రికి, పల్లెల్లో రాత్రికి తేడా లేదనగలమా? పల్లెలో రాత్రి ప్రొద్దు గూట్లో పడగానే ముసుగు బిగదన్నుకుంటుంది. నగరంలో రాత్రికి కునుకు పట్టాలంటే బుట్టెడు నిద్రమాత్రలు కావాలి. మంకు పట్టుపటి, తాబేలులా ముడుచుకుని, ఓమూలగా పడుకున్న ప్రియురాలి అలకను తీర్చినట్టుగా, వేవిధాలుగా బుజ్జగించిన తరువాతగానీ నగరంలో......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?