₹ 200
నా కలం పేరు మరియు నా పూర్తి పేరు: టి. ఎస్. ఏ. కృష్ణమూర్తి, (టి. కృష్ణ మూర్తి లేక తొడిమెల్ల కృష్ణమూర్తి,) చల్లని పుణ్యభూమి మదనపల్లె (చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్) లో 1950వ సంవత్సరంలో జన్మించాను.
నా తల్లిదండ్రులు శ్రీ టి. ఎస్. ఆంజనేయులు మరియు శ్రీమతి కమల్లా!్మ కమలమ్మ గార్లు. నా శ్రీమతి బి. కళావతమ్మ, టి. శివ భారత మూర్తి, ప్రసన్న లక్ష్మి నా పిల్లలు, ఎన్.కె. నిత్య, కె.రెడప్ప కోడలు, అల్లుడు. ముగ్గురు మనవళ్ళుఒక మనవరాలితో నిండు దిగువ మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్నాను.
1968 లో రాయడం మొదలు పెట్టాను . మొట్టమొదటి పెద్ద కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మెడ్రాస్ కళానికేతన్ స్టూడియో వారి గేవా కలర్ చిత్రాలతో 1971 లో ప్రచురితమైంది. కాస్త బాగా వ్రాయగల కథకుడుగా 1974 నుండి గుర్తింపు. 300 కథలు, 10 పెద్ద కథలు, ఆరు నవలలు, వందకు పైగా పరిచయాలు, వ్యాసాలు, ముందు మాటలు వ్రాసాను. వాటిలో 80 శాతం పైగా పత్రికలలో అచ్చయ్యాయి. తదుపరి గ్రంధ రూపాలు దాల్చాయి. ఇప్పటికి 16 గ్రంథాలు వెలువరించాను. వాటిలో రెండు గ్రంథములు పునర్ముద్రణలు పొందాయి. కొన్ని కథలు, ఒక నవల కన్నడ భాషలోకి, కొన్ని కథలు ఆంగ్ల భాషలోకి అనువదించబడినవి.
2013 వరకు వెలువడిన నా రచనల మీద ఎస్వీ యూనివర్సిటీ నుండి శ్రీ ఏ. రమా కుమార్ యాదవ్ నాలుగు సంవత్సరాలు పరిశోధన సల్పి పీహెచ్. డి పట్టం పొందారు. 3 పురస్కారాలు పొందిన నా ఆయుధం నవల మీద చెన్నై యూనివర్సిటీ నుండి డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ పిహెచ్.డి చేయుచున్నారు.
- Title :Sampurna Ghatodgajapuram Gathalu
- Author :T S A Krishnamurthy
- Publisher :T S A Krishnamurthy
- ISBN :MANIMN2586
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :152
- Language :Telugu
- Availability :instock