• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sindoora Tilakam

Sindoora Tilakam By Puppala Suryakumari

₹ 80

సామాజిక సమస్యల కవిత్వీకరణ

'సిందూర తిలకం సిందూర తిలకం'

కవయిత్రి ప్రముఖ సృజనాత్మక రచయిత్రి శ్రీను పపాల సూర్యకుమారి నవలా రచయిత్రిగా, కథారచయిత్రిగా, భకి ఆ గేయ సంపుటాల కవయిత్రిగా, లబ్ద ప్రతిష్ఠులు. ఇందులో ఆశావహదృకం పేరేపించే కవితా ఖండికలున్నాయి. కార్పొరేట్ విద్యారంగంపై అధికేసి

రలిసులకు హితోక్తులున్నాయి. ప్రపంచీకరణ మాయాజాల ప్రభావాన్ని నిరసించే కవితలున్నాయి. మాతృత్వపు ఔన్నత్యాన్ని వ్యక్తీకరించే కవితా ఖండికలున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కవితీకరణ లున్నాయి. రైతు సంక్షేమపు కవితలున్నాయి. జల చైతన్య గీతాలున్నాయి. రాజకీయ దోపిడీపై అధిక్షేపణలున్నాయి. ఉగాది కవితలో శాంతి అహింసల ప్రబోధాలున్నాయి. వర్తమాన సమాజాన్ని పట్టి పీడించే సమస్యలను కవయిత్రి ఈ సంపుటిలో కవిత్వీకరించారు.

'అకండజ్యోతి ఖండికలో' శ్వాస ఆగిపోతుందేమోగానీ, ఆశకు చావులేదు. స్టీఫెన్సన్ శరీరం చచ్చుబడినా, అతనిలో ఆశ జీవరసాలను వెదజల్లి, భౌతిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది. ఆశ లక్ష్యసాధనకు, సంజీవినిలా ఊపిరి పోస్తుంది అంటూ ఆశ ఔన్నత్యాన్ని గొప్పగా అభివర్ణించారు కవయిత్రి సూర్యకుమారి. “ఆకాశానికి నిచ్చెనలు” ఈ కవితలో తల్లిదండ్రుల అత్యాశవల్ల కార్పొరేట్ సంస్థల వారి ర్యాంకుల ప్రలోభం వల్ల విద్యార్థుల బంగారు బాల్యం ఛిద్రమవుతుందని నిరసించారు.

కవితా సంపుటి శీర్షిక సిందూర తిలకంలో తూర్పు దిక్కున ఉదయించే, క్రాంతి సింధూర తిలకం ఆమె చిహ్నం, లోకానికి మేల్కొలుపుల ప్రబోధయ...................

  • Title :Sindoora Tilakam
  • Author :Puppala Suryakumari
  • Publisher :KalimiSri Graphics
  • ISBN :MANIMN3369
  • Binding :Papar Back
  • Published Date :june, 2022
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock