• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Soldier Cheppina Kathalu

Soldier Cheppina Kathalu By Srinivas Banda

₹ 250

ఒక సోల్జర్ చెప్పిన కథలు

మన సాహిత్యంలో సైన్యవ్యవస్థకు చెందిన రచనలు అత్యంత అరుదు. మునిపల్లె రాజుగారి కథలు కొన్నిటిలోను, అంగర వెంకటకృష్ణారావు 'విరామం' లాంటి నవలలోనూ ఆ నేపథ్యం కనిపించినా ఆర్మీ జీవితాన్నే వస్తువుగా చేసిన  రచనలు మనకు కనబడవు. 

'సోల్జర్ చెప్పిన కథలు' ఆ లోటు తీరుస్తుంది.

ఓ ఇరవైయేళ్ళ యువకుడు సాధారణ సిపాయిగా సైన్యంలో అడుగుపెట్టి సగటును మించిన శ్రద్ధాసక్తులతో తన ఉద్యోగధర్మాలు నిర్వర్తించి, ఆ ప్రక్రియలో అందుబాటులో ఉన్న అవకాశాలను చొరవతో అంది పుచ్చుకుని, ఆ అవకా- శాలకు తన కఠోర దీక్షను జోడించి అంచెలంచెలుగా పై పదవులూ బాధ్యతలూ స్వీకరించి, ఇరవై ఒక్కేళ్ళ సర్వీసు తర్వాత జూనియర్ కమిషన్డ్ ఆఫీసరుగా పదవీ విరమణ చేసిన క్రమాన్ని కళ్ళకు కట్టిన రచన ఈ సోల్జర్ చెప్పిన కథలు.

సైన్యం అనగానే మన కళ్ళముందు కదలాడే పదం క్రమశిక్షణ. కఠోర క్రమశిక్షణ. రిక్రూట్గా చేరిన కథానాయకుడు బి.కె. రావ్ మొదటి అయిదు నెలల ప్రాథమిక శిక్షణలో ఎదుర్కొన్న అమానవీయమనిపించే అనుభవాలు,.............

  • Title :Soldier Cheppina Kathalu
  • Author :Srinivas Banda
  • Publisher :Astra Publishers
  • ISBN :MANIMN6012
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :199
  • Language :Telugu
  • Availability :instock