• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sonta Ooru

Sonta Ooru By Mokka Vinod Kumar

₹ 150

కల

"మ్మో...! తొందరగా కూడు కానీయ్ మా, బస్సొచ్చేయాలైంది" అంటూ ఒక పెద్ద పాత నల్లరంగు బ్యాగులో గుడ్డలు సర్దుకున్నాడు శివ. పొయ్ మీద ఎసురుబెట్టి, కుడితొట్టి కాడ కూర్చొని ఎసుట్లోకి బియ్యం కడుగుతూ

“అదికాదురబియా, నా మాటకొసారిన్రా. ఇప్పుడు బదరాబాదు పోవడమెందుకురా? ఇక్కడే ఉండి ఏదొక పంజేసుకుంటూ మా కళ్ళముందే ఉండొచ్చుకదా" అంది. బియ్యం కడిగేసి, కడిగిన నీళ్ళను కుడితొట్టిలో వొంచేసి, ఆ బియ్యాన్ని ఒక సిబ్బిలోకి పోసింది. పందిట్లోన్న పొయ్ కాడికొచ్చింది. అప్పటికే ఎసురు బాగా కాగి పొంగుతూ ఉంది. ఎసుట్లో బియ్యాన్ని వేసింది. బ్యాగు సర్దుకోవడం పూర్తైయ్యాక చూసుకుంటే ఆ బ్యాగుకి జిప్పు లేదని, అక్కడే పందిట్లో నులక మంచం పైన కాళ్ళు చాపుకుని కూర్చుని, వక్కాకు నవులుతున్న వాళ్ళ అవ్వతో "అవా, ఒక నాలుగు పిన్నీసులియ్ "బ్యాగి జిప్పు లేదు" అని అడిగాడు.

"ఐదరాబాదొద్దు, గీదరబాదోడ్డు. ఆ పాయింటు ఇప్పేసి, ఎల్లి కోళ్ళను గంపలకింద కప్పెట్టుపో. సీకటిపడతాన్ది” అని ఆమె మెడలో నల్ల తాడుకున్న పిన్నీసులు తీసి శివాకిచ్చింది......................

  • Title :Sonta Ooru
  • Author :Mokka Vinod Kumar
  • Publisher :Jhansi Publishers Hyd
  • ISBN :MANIMN6542
  • Binding :Papar back
  • Published Date :2025
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock