Logili Books

Literature

Stree Chalam Sahityam

By Chalam

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Stree Chalam Sahityam
Author
Publisher
Amaravathi Publications
ISBN
MANIMN6302
Binding
Papar Back
Published Date
JUNE, 2025
Number Of Pages
253
Language
Telugu
Availability
In Stock
About this book

మళ్ళీ ఈనాడు

మొదటి ముద్రణ చివర “ఈనాటికి యీ మార్గం, యీ పద్ధతులు నాకు మంచివని తోస్తున్నాయి. తప్పు కావచ్చు" అని రాసి, కాలం గడిచిన కొద్దీ నా అభిప్రాయాలు మారవొచ్చునని సూచించాను. నా ఉద్దేశ్యాలూ, ఆచారాలు మారితే చూసి సంతోషించాలని చాలామంది చాలా ఏళ్ళనుంచి కాచుకుని వున్నారు. నాలో “ఇన్టరెస్టు” (Interest) వల్ల కాదు. నా పద్ధతుల్ని అనుసరించి చెడిపోతున్నారని (బాగుపడుతున్నారని) అనుకునే యువకుల్ని నిరుత్సాహపరచి, తమవంటి నిర్జీవపు తుక్కుకింద మురగ పెట్టాలనే ఆశవల్ల. యువకులే భవిష్యత్తుకి ఆధారాలని కబుర్లేగాని, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తమకన్న బాగుపడతారంటే చాలా యీర్య. అందువల్లనే లోకానికి మహోప కారం చేసిన వాళ్ళు, జవసత్వాలు వున్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళకి తిరగ బడ్డవారే! తల్లిదండ్రుల మాట వినే కుర్రవాడికి గతులు లేవు. గురువుల మాట వినేవాళ్ళకి అంతకన్నా!

ఆనాడు పెద్దవాళ్ళమీద తిరుగుబాటు చేసిన యువకులు పెద్దవారై చిన్నవారికి నీతులు బోధించేది, అధికారాలుచేసి, అణగతొక్కడం చూస్తు న్నాను. తమకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేశారని తమ తల్లిదండ్రుల్ని తిడుతో తమ పిల్లలికి చిన్నప్పుడే బలవంతంగా పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రుల్ని చూస్తున్నాను. నాతో చేరి నా కథలూ, అభిప్రాయాలూ మెచ్చుకొని తమ స్వంత స్వతంత్రం మీద చాలా అభిలాష చూపి, గంతులు వేసి, పెళ్ళిళ్ళు చేసుకునీ, ఉద్యోగాలు సంపాయించుకునీ, యిళ్ళు కట్టుకునీ, చప్పుడు కాకుండా మాయమైన వాళ్ళని ఎరుగుదును. స్వతంత్ర దేవత కలకత్తా కాళీకన్నా భయంకరమైనది. నిరంతరమూ సుఖ నైవేద్యాన్నీ, అశ్రు............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?